కొత్త అధికార నివాసంలోకి సీఎం | Sakshi
Sakshi News home page

కొత్త అధికార నివాసంలోకి సీఎం

Published Fri, Nov 25 2016 3:06 AM

కొత్త అధికార నివాసంలోకి సీఎం - Sakshi

సంప్రదాయబద్ధంగా గృహప్రవేశం  
దగ్గరుండి పర్యవేక్షించిన చినజీయర్ స్వామి
 
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కొత్త అధికార నివాస గృహ ప్రవేశం గురువారం సంప్రదాయబద్ధంగా జరిగింది. తెల్లవారు జామున 5.22 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు బేగంపేటలోని నూతన గృహంలోకి ప్రవేశించారు. చినజీయర్ స్వామి సమక్షంలో శృంగేరీ వేద పండితుల మంత్రోఛ్చారణ మధ్య ఈ కార్యక్రమం జరిగింది. కార్తీక మాసంలో గృహప్రవేశం చేస్తే మంచిదనే ఉద్దేశంతో కేసీఆర్ రోడ్లు భవనాల శాఖ అధికారులకు టార్గెట్ పెట్టి మరీ నిర్ణీత సమయంలో క్యాంపు కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. దీంతో గురువారం అనుకున్న ముహూర్తానికి గృహప్రవేశం జరిగింది.
 
 సంప్రదాయబద్ధంగా...
 శృంగేరీ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య చినజీయర్ స్వామి కేసీఆర్ దంపతు లతో గృహప్రవేశాన్ని శాస్త్రోక్తంగా నిర్వ హించారు. దైవ ప్రవేశం, యతి ప్రవేశం, గో ప్రవేశం, నివసించే వారి ప్రవేశం తదితర  ఘట్టాలన్నింటినీ జరిపించారు. అనంతరం వాస్తు హోమం, సుదర్శన హోమం నిర్వహించారు. ముఖ్యమైన కార్య క్రమాలకు దైవ బలం తోడుండాలని భా వించే కేసీఆర్... అన్ని ప్రధాన కార్యక్ర మాల వేళ హోమాలు నిర్వహించడాన్ని ఆనవాయితీగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే గురువారం సుదర్శన హోమం నిర్వహించారు. ఇక తాను విధులు నిర్వ హించేందుకు ఉపయోగించే ఆసనంలో ముందుగా చినజీయర్ స్వామిని కూర్చో బెట్టి.. ఆ తర్వాతే కేసీఆర్ కూర్చుని, పని ప్రారంభించారు.
 
కార్యక్రమానికి హాజరైన గవర్నర్ దంపతులకు కేసీఆర్ దంపతులు ప్రధాన ద్వారం వద్ద నుంచే సాదరంగా స్వాగతం పలికారు. చివరగా సర్వమత ప్రార్థనలు కూడా నిర్వహించారు. ముఖ్య మంత్రి, గవర్నర్‌లను ఆయా మతపెద్దలు ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రు లు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీ కవిత దంపతులు, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement