రీ వెరిఫికేషన్‌పై ఆందోళన వద్దు 

5 May, 2019 01:40 IST|Sakshi

ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌

సాక్షి, హైదరాబాద్‌: జవాబు పత్రాల రీ వెరిఫికేషన్‌ పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల ప్రకారం ఇంటర్మీడియెట్‌లో ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాల రీ వెరిఫికేషన్‌ ప్రక్రియ రాష్ట్రంలోని 12 మూల్యాంకన కేంద్రాల్లో జరుగుతోందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రీ వెరిఫికేషన్‌తో గ్లోబరీనా సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

రీ వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత ఆ మార్కులను ఇంటర్‌ బోర్డుకు పంపిస్తారన్నారు. ఇలా వచ్చిన మార్కులతో ఫలితాల ప్రాసెసింగ్‌ చేయడానికి త్రిస భ్య కమిటీ సూచనల మేరకు తెలంగాణ స్టేట్‌ టెక్నలాజికల్‌ సర్వీసెస్‌ సంస్థ ద్వారా ‘డేటాటెక్‌ మెథడెక్స్‌’అనే ఓ కంప్యూటర్‌ ఏజెన్సీని ఎంపిక చేశామన్నారు. ఈ సంస్థ, గ్లోబరీనా సంస్థ రెండూ వేర్వేరుగా జవాబు పత్రాల రీ వెరిఫికేషన్‌ చేపట్టిన తర్వాత వచ్చిన మార్కులతో రిజల్ట్స్‌ ప్రాసెసింగ్‌ ప్రక్రియను సమాంతరంగా నిర్వహిస్తాయని తెలిపారు.

మరిన్ని వార్తలు