ప్రాణభిక్ష పెట్టరూ..

11 Jul, 2015 01:01 IST|Sakshi
ప్రాణభిక్ష పెట్టరూ..

బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి
చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందిపడుతున్న తల్లిదండ్రులు
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

 
నర్మెట : ఇంజినీరింగ్ విద్యార్థి ఒకరు బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆదుకునే వారికోసం ఎదురు చూస్తున్నాడు. కొడుకుకు ప్రాణభిక్ష పెట్టాలని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నర్మెట మండల కేంద్రానికి చెందిన దేవరకొండ భాగ్యలక్ష్మి-శంకరయ్య దంపతులకు ఒక్క కొడుకు, ఇద్దరు బిడ్డలు. మోచీ పనిచేసి బతికే వీరి కొడుకు దేవరకొండ సుధీర్ ఖమ్మం కేఎల్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బిటెక్  చదువుతున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 22న కడుపునొప్పితో బాధపడడంతో వ రంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు హైదారాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి వైద్యులు సుధీర్‌కు వివిధ పరీక్షలు నిర్వహించి బ్లడ్ క్యాన్సర్ ఉందని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యూరు.

ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలు కాపాడుకోవడం కోసం తమిళనాడులోని వెల్లూరులో క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. వైద్యం కోసం రూ. 20 లక్షలు ఖర్చు చేశారు. ఉన్న ఇంటిని అమ్మేశారు. ఇంకా రూ.24 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపినట్లు తల్లిదండ్రులు తెలిపారు. కూటికి గతి లేని తాము అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటూ రోదిస్తున్నారు. ఏమిచేయూలో తెలియక తల్లడిల్లుతున్నారు. మానవతావాదులు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి బిడ్డను ఆదుకుని కొడుకుకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. సుధీర్‌కుమార్‌కు సాయం చేయాలనుకున్న వారు 09652383426 మొబైల్ నంబర్‌కు లేదా ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నెం.026110025051399లో డబ్బులు జమచేయూలని కోరుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు