ఖరీఫ్‌లో ఫుల్లుగా విద్యుత్

30 Apr, 2015 01:53 IST|Sakshi
ఖరీఫ్‌లో ఫుల్లుగా విద్యుత్

‘సాక్షి’తో జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు

హైదరాబాద్: ‘రానున్న ఖరీఫ్‌లో పంటలు వేసుకోవడానికి ఎలాంటి ఆంక్షలు ఉం డ వు. ఎంత విస్తీర్ణం లో పం టలు సాగు చేసినా 7 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తాం’ అని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల చైర్మన్, ఎండీ డి.ప్రభాకర్‌రావు చెప్పారు. వేసవిలో ఇప్పటి వరకు సరఫరా చేస్తున్న కోతల్లేని నిరంతర విద్యుత్‌ను వచ్చే మే నెలలోనూ కొనసాగిస్తామన్నారు. విద్యుత్ పరిస్థితిపై సీఎం కేసీఆర్ బుధవారం నిర్వహిం చిన సమీక్షలో పాలొ ్గన్న అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

విద్యుత్ కొరత  దృష్ట్యా ప్రస్తుత రబీలో ఆరుతడి పంటలే వేసుకోవాలని రైతులకు సూచించడం ద్వారా వారికి నష్టం లేకుండా చూశామన్నారు. ఖరీఫ్‌తో కలుపుకుని 7 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా ఆలోగా రాష్ట్రం 6 వేల మెగావాట్ల ఉత్పత్తి చేస్తుందన్నారు. థర్మోటెక్ నుంచి 540 మెగావాట్ల కొనుగోలుకు త్వరలో ఒప్ప ందం చేసుకోబోతున్నామని, మరో 300 మెగావాట్లను సీజీఎస్ నుంచి తీసుకుంటామన్నారు.
 
 
 
 

మరిన్ని వార్తలు