టీఆర్‌ఎస్‌లో కలకలం!

7 Sep, 2019 09:25 IST|Sakshi

తెరపైకి తెలంగాణ ఉద్యమ నేపథ్యం 

‘ఈటె’లుగా మారుతున్న రాజేందర్‌ వ్యాఖ్యలు

తాజాగా రాజకీయ నాయకులకు మెరిట్‌ ఉండాలని సూచన

 సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన రసమయి వ్యాఖ్యలు

ఈటల, రసమయి వ్యాఖ్యలపై అధిష్టానం ఆరా

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమం నాటి నుంచి టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న కరీంనగర్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్‌ఎస్‌లో ‘ఉద్యమ నేపథ్యం’ అనే మాటలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రెవెన్యూ ఉద్యోగ సం ఘ నాయకులతో మంత్రి చర్చించారనే వార్తల పై ఇటీవల హుజూరాబాద్‌లో ఘాటుగా స్పం దించిన మంత్రి ఈటల రాజేందర్‌కు మానకొం డూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తన మా టలతో బాసటగా నిలవడం ఏ పరిణామాలకు దారితీస్తోందోననే అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా క లెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొ లుత మాట్లాడిన రసమయి బాలకిషన్‌ నవ్వు తూ మాట్లాడుతూనే ‘పొట్టలో ఉన్నది దాచుకోకుండా’ బహిర్గతం చేసిన తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

‘19 ఏళ్ల కిందట తాను టీచర్‌గా పాఠాలు చెప్పిన సిద్దిపేట జిల్లా ఇంద్రగూడెం స్కూల్‌లో అప్పటికి, ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని, పాఠశాల బోర్డు మాత్రం ‘ఆంధ్రప్రదేశ్‌’కు బదులు ‘తెలంగాణ’గా మా రిందని తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినట్లయిందని టీ ఆర్‌ఎస్‌ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు గు రుకులాలల వ్యవస్థ విజయవంతమైందని, రెండు మూడు హైస్కూళ్లను ఒకటిగా చేసి మినీ రెసిడెన్సియల్‌ స్కూళ్లు చేయాలని సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారని చెబుతూనే... పాఠశాలల్లో కనీ స మౌలిక సదుపాయాలు కల్పించకపోవడాన్ని సుతిమెత్తగా విమర్శించారు. ‘రాజేందరన్న నే ను ఉద్యమాల నుంచి వచ్చినోళ్లం. వాస్తవాల మీద ఉద్యమాలు నడిపినోళ్లం. తెలంగాణ రా ష్ట్రం ఎట్ల ఉండాల్నో కలలు కన్నోళ్లం. వాస్తవంగా ఒక్కోసారి చాలా బాధనిపిస్తోంది’ అని చేసి న వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ వాతావరణాన్ని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలుగా విశ్లేషిస్తున్నారు. రసమయి వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుం డడం గమనార్హం. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ వేదికగా టీఆర్‌ఎస్‌లో తాజాగా తెరపైకి వచ్చిన ‘ఉద్యమ నేపథ్యం’ మాటలు ఎటువైపునకు దారితీస్తాయోనన్న ఆసక్తిని రేపుతున్నాయి. 

ఆకలి, అంతరాలు దూరం కాలేదన్న ఈటల
‘మంత్రి పదవి భిక్ష కాదు... గులాబీ జెండా ఓనర్లం మేం’ అనే మాటలతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టించిన ఈటల రాజేందర్‌ గు రువారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ రాజకీయ నాయకులకు సైతం మెరిట్‌ ఉండాలనే కొత్తటాపిక్‌ తీసుకురావడం గమనార్హం. ‘సమాజంలో టీచర్‌కు మెరిట్‌ ఉంటది కలెక్టర్‌కు, డాక్టర్‌కు, ఇంజనీర్‌కు మెరిట్‌ ఉంటది. కానీ మెరిట్‌ లేకుం డా ఉన్న వాళ్లు కొద్ది మంది రాజకీయ నాయకులు. మెరిట్‌ ఉండాల్సింది వాళ్లకు ఇవ్వాల’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. ‘72 సంవత్సరాల భారతదేశంలో ‘డెవలప్‌మెంట్‌ విత్‌ ఈక్వల్‌ డిస్ట్రిబ్యూషన్‌’ అని రాజ్యాంగంలో రాసుకున్నాం. కానీ ఈ దేశంలో రాజ్యాంగంలో రాసుకున్నట్టుగా ఆకలి, అంతరాలు చాలా మటుకు దూరం కాలేదు. అంబేద్కర్‌ ఆలోచనా విధానాన్ని, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడంలో పాలకులు విఫలమయినరా? తప్పకుండా చర్చ జరగాలి’ అని తన ఆవేదనను ఉపాధ్యాయులు, ఉన్నతాధికారుల సమక్షంలో పంచుకోవడం గమనార్హం.

నిఘా వర్గాల ఆరా!
ఈటల హుజూరాబాద్‌లో చేసిన ఘాటైన వ్యా ఖ్యలు చర్చనీయాంశమైన నేపథ్యంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మరునాడే హైదరాబాద్‌ వెళ్లి ఈటలను కలిశారు. గురువారం కలెక్టరేట్‌లో ఒకే వేదికపై దేశంలో, రాష్ట్రంలోని పరిస్థితులపై ఇద్దరు నేతలు తమ ఆవేదనను ‘పంచు’కున్నారు. దీనిపై పత్రికలు, టీవీలు, సోషల్‌మీడియాల్లో రకరకాల కథనాలు వెలువడిన నేపథ్యంలో నిఘావర్గాలు ఈ విషయమై ఆరా తీస్తున్నాయి. గురువారం నాటి సమావేశానికి సంబంధించిన పూర్తి రికార్డులను ఇంటలిజెన్స్‌ వర్గాలు సేకరించినట్లు సమాచారం. ఏ పరిస్థితుల్లో రసమయి వ్యాఖ్యలు చేశారు? పూర్వపరాలేమైనా ఉన్నాయా? కరీంనగర్‌ జిల్లా నుంచే ఇద్దరు నేతలు సర్కారు వైఖరికి భిన్నంగా గొంతు విప్పడంలో గల ఆంతర్యం ఏంటనే విషయాలను ఆరా తీసిన నిఘా వర్గాలు నివేదికను సర్కారుకు పంపించినట్లు సమాచారం. ఈ సం దర్భంగా పలువురి ఫేస్‌బుక్‌ ఖాతాలు, పోస్టింగ్‌లతోపాటు సోషల్‌ మీడియాలో పోస్టింగులు, వాటిపై వ్యక్తమవుతున్న అభిప్రాయాలను కూ డా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా టీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ శాఖలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ యంత్రాంగాన్ని అయోమయానికి గురి చేస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు