శిశువుల ఆరోగ్యానికి భరోసా

6 Aug, 2014 01:16 IST|Sakshi
శిశువుల ఆరోగ్యానికి భరోసా

నల్లగొండ టౌన్ :శిశుమరణాల సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా చిన్నారులకు వచ్చే రోగాలపై తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం.. ఐదేళ్ల లోపు వయస్సు ఉన్నవారిలో ఎక్కువశాతం మరణాలు నిమోనియా(శ్వాస సంబంధ), అతిసా రం, మలేరియా, ఇతర జ్వరాలతో పాటు పౌష్టికాహారలోపం కారణంగా సంభవిస్తున్నాయి. వీటిని అరికట్టాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో చిన్నారులకు వచ్చే డయేరియా( నీళ్ల వేరేచనాలు) వ్యాధితోపాటు, తల్లిపాల ప్రా ముఖ్యత, అనుబంధ ఆహారంపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం నుంచి డయేరియా నివారణ పక్షోత్సవాల పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎస్‌పీహెచ్‌ఓలు, వైద్యాధికారులు, హెల్త్ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఇతర వైద్య ఆరోగ సిబ్బందికి జిల్లా కేంద్రంలో వారం రోజులపాటు శిక్షణ ఏర్పాటు చేశారు.
 
 దీనికి అవసరమైన 3లక్షల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలను జిల్లాకు తెప్పించారు. వాటిని ఇప్పటికే జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలకు పం పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం నుంచి  ప్రతి గ్రామంలో వై ద్య ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు ఇం టింటికీ తిరిగి ఐదేళ్లలోపు వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు డయేరి యాపై అవగాహన కల్పిస్తారు. డయేరియా(నీళ్ల విరేచనాలు) రావడానికి గల కారణాలు, దాని వల్ల కలిగే అనర్థాలను వివరించి ఓఎస్‌ఆర్ ప్యాకె ట్లు, జింక్ ట్యాబ్లెట్లు  అందజేస్తారు. పది హేను రోజుల పాటు నిర్వహించే ఈ కా ర్యక్రమంలో వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది తో పాటు ఐసీడీఎస్, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, డ్వాక్రా, మహిళా సంఘాల సహకారం తీసుకోనున్నారు.
 
 అన్ని ఏర్పాట్లు పూర్తి
 డయేరియా పక్షోత్సవాల కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లా వ్యాప్తంగా అవసరమైన ఓఆర్ ఎస్ ప్యాకెట్లు, జింక్ ట్యాబ్లెట్లను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేశాం. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం.
 - పి.ఆమోస్,
 జిల్లా వైద్యశాఖ అధికారి
 
 

మరిన్ని వార్తలు