కాళేశ్వరానికి ఇరుసు మల్లన్నసాగర్‌

28 Mar, 2018 03:12 IST|Sakshi
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పనులను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు

మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్య 

సిద్దిపేటజోన్‌: కాళేశ్వరం ప్రాజెక్టుకు మల్లన్నసాగర్‌ ఇరుసు లాంటిదని, ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకేజీ 12 పనులను సోమవారం అర్ధరాత్రి సుమారు 3 గంటల పాటు మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. సిద్దిపేట మండలం వెంకటాపూర్‌ నుంచి తొగుట మండలం తుక్కాపూర్‌ వరకు సొరంగంలోనే కలియ తిరిగారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మల్లన్నసాగర్‌        సొరంగం, పంప్‌హౌస్‌ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు.  

ఓ వైపు మల్లన్నసాగర్‌.. మరోవైపు కాళేశ్వరం 
మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అవసరమైతే లేబర్‌ సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు. సొరంగం దాదాపు 17 కిలోమీటర్లు ఉండగా.. పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయని, ఇప్పటికే 8 కిలోమీటర్లకు పైగా సిమెంట్‌ లైనింగ్‌ పూర్తయినట్టు చెప్పారు. సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మసాగర్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, యాదాద్రి జిల్లాలోని గందమల్ల, బస్వాపూర్, నిజామాబాద్‌ జిల్లాలోని నిజాంసాగర్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని శామీర్‌పేటకు మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ఫలాలు అందనున్నాయని మంత్రి తెలిపారు. వారం, పది రోజుల్లో పంప్‌హౌస్‌ పనులు, సర్జిఫుల్‌ గేట్లు పూర్తి కానున్నట్టు పేర్కొన్నారు.

ఒకవైపు మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ పనులు జరుగుతుండగా.. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని సొరంగం, పంప్‌హౌస్‌ల ద్వారా కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలకు నీరందించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అత్యంత ఆధునిక టెక్నాలజీ కలిగిన భారీ మోటార్లు విదేశాల నుంచి తీసుకొచ్చి.. పనులు చేపడుతున్నట్టు తెలిపారు. అనంతరం సొరంగంలో పనులు నిర్వహిస్తున్న కార్మికులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. ఇక్కడ పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులకు గుర్తింపుకార్డులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్‌ సిబ్బంది ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పతులా.. సతులా..!

బాల్యం.. వారికి మానని గాయం

సాయానికి వెళ్తే.. ప్రాణం పోయింది

ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

బర్డ్స్‌ ఫొటోగ్రఫీ అంత తేలిక కాదు..

కారు గుర్తు నాదే.. కాదు.. నాదే!

వివాహేతర  సంబంధానికి  అడ్డుగా ఉన్నాడని..

ఓలా.. లీజు గోల

పెట్రోల్‌లో నీళ్లు..

ప్రతి కుటుంబానికి రూ.పది లక్షల లబ్ధి

గ్రామాలకు అమెరికా వైద్యం

ఆస్తి కోసం నా కుమారుడు చంపేశాడు

సాయంత్రమూ సాఫ్‌

గన్నీ బ్యాగుల సేకరణకు కొత్త మార్గం

నిధులు మంజూరు చేయండి: ఎమ్మెల్యే

మండలానికో డెయిరీ పార్లర్‌

చింతమడకలో సీఎం సార్‌ మెనూ..

మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

సీఎం కేసీఆర్‌ పర్యటన హైలైట్స్‌!

ఉన్నారా.. లేరా? 

‘నందికొండ’కు క్వార్టర్లే అండ..!

ఉద్యోగాలు కోరుతూ వినతిపత్రాలివ్వొద్దు..

పాములకు పాలు పట్టించడం జంతుహింసే!

జాతీయ రహదారులకు నిధులివ్వండి 

26 నుంచి రాష్ట్ర వాసుల హజ్‌ యాత్ర 

40% ఉంటే కొలువులు

యథావిధిగా గ్రూప్‌–2 ఇంటర్వ్యూలు

‘కళ్లు’గప్పలేరు!

సకల హంగుల పట్టణాలు! 

పోటెత్తిన గుండెకు అండగా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

పెన్‌ పెన్సిల్‌

తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా