కేఎంసీని సందర్శించిన ఎంసీఐ బృందం

10 May, 2014 03:43 IST|Sakshi
కేఎంసీని సందర్శించిన ఎంసీఐ బృందం

 ఎంజీఎం, న్యూస్‌లైన్ : కాకతీయ మెడికల్ కళాశాలకు శుక్రవారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా బృందం వచ్చింది. ఎంబీబీఎస్ సీట్లు 150 నుంచి 200కి పెంచిన నేపథ్యంలో ఇందుకోసం కళాశాలలో కల్పించిన మౌలిక సదుపాయాలు, బోధన సిబ్బందిని ఆ బృందం పరి శీలించింది. ఉదయం 8.00 గంటలకే కళాశాలకు చేరుకున్న ఇద్దరు సభ్యుల బృందం పలు విభాగాలను సందర్శించిన అనంతరం 10.00 గంటల సమయంలో ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని మెడిసిన్, సర్జరీ, పిడియాట్రిక్, ఈఎన్‌టీ, బర్న్స్, ఎమర్జెన్సీ వార్డులతోపాటు రీజినల్ కంటి ఆస్పత్రి, టీబీ ఆస్పత్రిని సందర్శించారు. తర్వాత కేఎంసీ కళాశాలకు చేరుకున్నారు.

వివి ధ విభాగాల్లో ఎంసీఐ నిబంధనల ప్రకారం 200 సీట్లకు తగ్గట్టుగా సిబ్బంది ఉన్నారా.. లేదా అనే విషయాన్ని పరిశీలించారు. ఎంసీఐ బృందం సందర్శనలు శనివారం కూడా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. బృందం వెంట కేఎంసీ ప్రిన్సిపాల్ రాంచందర్ ధరక్, ఎంజీఎం సూపరింటెండెంట్ మనోహర్, ఆర్‌ఎంఓలు నాగేశ్వర్‌రావు, హేమంత్, శివకుమార్, డాక్టర్ బలరాం ఉన్నారు. ఎంసీఐ బృందం తయారు చేసిన నివేదికను ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సమర్పిస్తారని ప్రిన్సిపాల్ ధరక్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు