మలుపు తిరుగుతున్న శ్రీనివాస్‌ మృతి కేసు

31 Aug, 2019 11:28 IST|Sakshi

సాక్షి, ఖమ్మం(సత్తుపల్లి) : ఖమ్మంలోని సీసీఎస్‌ పోలీసులు విచారణ పేరుతో సత్తుపల్లి ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన బొలిశెట్టి శ్రీనివాస్‌ (18) అలియాస్‌ బన్ను అనే పాతనేరస్తుడిని ధర్డ్‌ డీగ్రీ పేరుతో చిత్రహింసలకు గురిచేయడంతోనే మృతి చెందాడని అతని కుటుంబసభ్యులు గురువారం ఆరోపించిన విషయం విదితమే. అయితే ఇప్పటివరకు శ్రీనివాస్‌ను చిత్రహింసలకు గురిచేసిన ఆ సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్య తీసుకోకపోవటంపై పలు విమర్శలు వినపడుతున్నాయి. శ్రీనివాస్‌ మృతిచెందిన రోజు కొంతమంది పోలీస్‌ సిబ్బంది దగ్గరుండి హడావుడి చేసి శ్రీనివాస్‌ అంత్యక్రియలు నిర్వహించేవరకు తమపై ఒత్తిడి తెచ్చారని శ్రీనివాస్‌ తల్లి ఆరోపించింది. పెళ్లి కాని యువకుడు కాబట్టి తమ సంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని మట్టిలో పూడ్చిపెడతామని అయితే తమపై పోలీసులు ఒత్తిడి చేసి ఖననం చేయించారని ఆమె ఆరోపించింది.

శ్రీనివాస్‌ను చిత్రహింసలకు గురిచేసిన కానిస్టేబుళ్లలో ఒకరు శ్రీనివాస్‌పై కొంతకాలంగా క్షక్ష్య కట్టాడని ఎందుకంటే శ్రీనివాస్‌ ఆ కానిస్టేబుల్‌కు సంబంధించిన వ్యవహారాన్ని ఓ దొంగతనం కేసులో పోలీస్‌ అధికారులకు చెప్పటం వల్లే దానిని మనసులో పెట్టుకొని ఈవిధంగా తమ కొడుకును పొట్టన పెట్టుకున్నాడని ఆమె వాపోయింది. వాస్తవానికి శ్రీనివాస్‌ దొంగతనాలు మానివేసి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడని, ఆ ఆటోను కూడా గతంలో మంచిగా బతకాలని ఓ సీఐ ఇప్పించారని శ్రీనివాస్‌ కుటంబ సభ్యులు తెలిపారు. తమపై పోలీసుల ఒత్తిడి ఉందని కూడా వారు పేర్కొన్నారు. 

 

మరిన్ని వార్తలు