రాములమ్మకు ఎవరు ఓటు వేయరు

23 Apr, 2014 20:18 IST|Sakshi
రాములమ్మకు ఎవరు ఓటు వేయరు

మెదక్ ఎమ్మెల్యే స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయశాంతిపై ఆ స్థానం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన పద్మ దేవేందర్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున మెదక్ ఎంపీగా ఎన్నికై స్థానిక ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. బుధవారం మెదక్లో పద్మ దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ను విమర్శించే అర్హత విజయశాంతికి లేదన్నారు. విజయశాంతి మెదక్ జిల్లా వాసి కాదని, ఆమెకు ఆ జిల్లాలో ఎవరు ఓటు వేయరని పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు.  

తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆమె ఆ పార్టీ  కార్యకలాపాల్లో పాల్గొంటూ ఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే విజయశాంతి నిన్న టీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ టీఆర్ఎస్కు కొత్త అర్థాన్ని వివరించారు. టీఆర్ఎస్లో టీ అంటే  తెరచాటు వ్యవహరాలు, ఆర్ అంటే రాత్రి పూట ఒప్పందాలు, ఎస్ అంటే సపరివార కుటుంబ పాలన అంటూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల వరకు తమ పార్టీతో అంటకాగిన రాములమ్మ ఇప్పుడు తమ పార్టీపైన, పార్టీ అధ్యక్షుడుపైన తీవ్ర విమర్శలు చేస్తుండటంతో పద్మ దేవేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు