ప్రజా సమస్యలపై పోరాడింది ఒక్క జగనన్నే: షర్మిల | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై పోరాడింది ఒక్క జగనన్నే: షర్మిల

Published Wed, Apr 23 2014 9:21 PM

ప్రజా సమస్యలపై పోరాడింది ఒక్క జగనన్నే: షర్మిల - Sakshi

కర్నూలు: ప్రజల సమస్యలపై పోరాడింది ఒక్క జగనన్నే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు.  ప్రజల సమస్యలపై నిరాహారదీక్షలు చేసింది జగనన్నే అని కర్నూలు జిల్లా ఆత్మకూరు, నంద్యాలలో జరిగిన సభల్లో షర్మిల ప్రసంగించారు. ప్రజల ముఖంలో చిరునవ్వు జగనన్నకు ముఖ్యమని షర్మిల అన్నారు. 
 
సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేసిన ఘనత ఒక్క వైఎస్‌ఆర్ కే దక్కుతుందన్నారు. ఐదేళ్లలో వైఎస్‌ఆర్‌ ఎలాంటి చార్జీలు పెంచలేదని ఆమె తెలిపారు. పేద ప్రజల కోసం వైఎస్‌ఆర్ ప్రారంభించిన సంక్షేమ పథకాలకు కాంగ్రెస్‌ తూట్లు పొడిచిందని షర్మిల విమర్శించారు. ఆర్టీసీ చార్జీలను ఐదుసార్లు పెంచిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. దేశం మొత్తంమీద 47లక్షల ఇళ్లు నిర్మిస్తే,  ఒక్క మన రాష్ట్రంలోనే 47లక్షల ఇళ్లను వైెఎస్ఆర్ కట్టించారని షర్మిల వెల్లడించారు. 
 
అధికార పక్షాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు, వారితో కుమ్మక్కై ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడారని ఆరోపించారు.  9 ఏళ్లలో చంద్రబాబు హయాంలో ఒక్క హామీని కూడ నిలబెట్టుకోలేదని,  అధికారంలోఉన్న చంద్రబాబు ఏనాడైనా రైతుల రుణమాఫీ గురించి ఆలోచించారా షర్మిల నిలదీశారు. బాబు హయాంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని షర్మిల తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement