హైకోర్టును ఆశ్రయించిన రేవంత్‌ సోదరులు

5 Mar, 2020 16:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి సోదరులు హైకోర్టును ఆశ్రయించారు. శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి గ్రామంలోని తమ భూమిని ప్రభుత్వం అక్రమంగా లాక్కోవాలని చూస్తుందంటూ గురువారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 2005లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భూమిని ఖాళీ చేయించడానికి కుట్ర చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

(చదవండి : బయటపడ్డ రేవంత్‌రెడ్డి అక్రమాలు: క్రిమినల్‌ కేసు )

ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. తమ భూమిని తమ నుంచి దూరం చేయకుండా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. రేవంత్‌ సోదరుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. అసలు ఏం జరిగిందనే దానిపై అధికారులను అడిగి తెలుసుకుంటామని చెప్పారు. రేపటి(శుక్రవారం) వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న చట్టం ప్రకారం నడచుకోవాలని అధికారులకు సూచించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.  

(చదవండి : భూ ఆక్రమణ.. వాల్టా ఉల్లంఘన! )

మరిన్ని వార్తలు