రైతుల అభ్యున్నతికే ‘రైతు బంధు’

30 May, 2018 10:17 IST|Sakshi
ఏనుగొండలో చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం అర్బన్‌ మండలంలోని ఏనుగొండ రెవెన్యూ గ్రామంలో రైతుబంధు పథకం చెక్కులను రైతులకు అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులు అప్పులపాలు కాకుండా వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందజేస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల శ్రేయస్సుకు ఎకరానికి రూ.4వేలు సాయం అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సర్వే చేసి రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తుందని అన్నారు. రైతులు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వా త సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ మహాయజ్ఞంలో భాగంగానే రైతులకు ఆర్థిక సాయం అందించే విధంగా ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. రైతుల పేర్లు తప్పొప్పు లు ఉంటే సవరించడానికి వీలుగా ప్రత్యేక అధికా రులను నియమించడం జరిగిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెట్టుబడి సాయం పొందాలని కోరారు. కార్యక్రమంలో త హసీల్దార్‌ ఎంవీ ప్రభాకర్‌రావు, డీటీ కోట్ల మురళీధర్, ఎంఆర్‌ఐ క్రాంతికుమార్‌గౌడ్, కౌన్సిలర్లు వ నజ, శివశంకర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ రాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు