ఆసరా పోయిందని కుప్పకూలారు

27 Nov, 2014 01:31 IST|Sakshi

* ఏడుగురు మృతి
* మృతుల్లో హైదరాబాద్‌వాసి  

సాక్షి నెట్‌వర్క్: ఇంతకాలం తమ జీవితాలను ఆసరాగా ఉన్న పింఛన్లు ఇక రావనే బెంగతో వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగురు మరణించారు. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన కొయ్యడ కొంరయ్య(80)కి గతంలో వృద్ధ్యాప్య పింఛన్ వచ్చేది. తాజా జాబితాలో కొంరయ్య పేరు లేదు. దీంతో మనస్తాపానికి చెంది బుధవారం గుండెపోటుకు గురయ్యాడు. ఇదే మండలం కిష్టంపల్లెకు చెం దిన బొనాల రాజయ్య(85) పేరూ జాబితాలో లేకపోవడంతో మనస్తాపం చెంది మరణించా డు. ఇదే జిల్లా హుజూరాబాద్ మండలం వెంకట్రావ్‌పల్లిగ్రామానికి చెందిన అట్ల ఎల్లయ్య(80)కు గతంలో పింఛన్ వచ్చేది.

ఇటీవల గ్రామంలో కొందరికి పింఛన్లు పంపిణీ చేశారు. ఎల్లయ్యకు సదరు జాబితాలో పింఛన్ రాలేదు. దీంతో తనకు పింఛన్ వస్తుందో రాదోనని ఆందోళనకు గురైన ఎల్లయ్య గుండెపోటుకు గురై మృతి చెందాడు. అయితే, ఎల్లయ్య పింఛన్ మంజూ రైందని తహశీల్దార్ నాగేశ్వరరావు తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ గ్రామానికి చెందిన మేతరి సాయిలు(45) వికలాంగుడు. ఎకరం భూమి ఉంది. సాగునీటి వసతి లేకపోవడంతో అప్పు చేసి రెండేళ్ల క్రితం బోరు వేయగా, నీరు పడలేదు. దీంతో ఆరుతడి పంటలే వేస్తున్నాడు. ఈ ఏడాది పత్తి వేయగా, వర్షాభావ పరిస్థితుల్లో పంట పూర్తిగా ఎండిపోయింది.

ఇదే క్రమంలో సాయిలుకు వస్తున్న పింఛన్ సైతం ఆగిపోయింది. వారం రోజులుగా కార్యాలయం చుట్టూ తిరిగిన సాయిలు మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన సదరం క్యాంపునకు హాజరయ్యాడు. ఇంటికి వచ్చిన సాయిలు అప్పులు ఎలా తీర్చాలోనని, పింఛన్ వస్తుందో రాదోనని మదనపడ్డాడు. బుధవారం వేకువ జామున మనోవేదనతో గుండెపోటుకు గురయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లా తెలకపల్లి మండలం పెద్దూరుకు చెందిన సంగిశెట్టి చెన్నమ్మ(75) పదేళ్లుగా పింఛన్ పొందుతోంది. తాజా జాబితాలో చెన్నమ్మ పేరు లేదు. దీంతో వారం రోజులుగా బెంగపట్టుకుంది.

మూడు రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరిగింది. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో చనిపోయింది. వరంగల్ జిల్లా తొర్రూరు మండలం ఖానాపురం గ్రామానికి చంఎదిన బచ్చలి వెంకటయ్య పింఛన్ జాబితాలో పేరులేకపోవడంతో మనస్తాపంతో మృతి చెందాడు. ఇదిలా ఉండ గా, హైదరాబాద్‌లోని కార్వాన్ తాళ్లగడ్డకు చెం దిన గోనెల నారాయణ(68)కు  గతంలో పింఛ న్ వచ్చేది. ఈసారి రాకపోవడంతో పింఛన్ ఇచ్చే కేంద్రానికి, తహసీల్దార్ కార్యాల యానికి వారం రోజులపాటు తిరిగాడు. మంగళవారం కూడా ఈ రెండు చోట్లకు వెళ్లాడు. పింఛన్ రాలేదనే బెం గతో  ఇంటికి చేరాడు. ఒంట్లో నలతగా ఉండ డంతో బుధవారం కుటుంబసభ్యులు ఉస్మాని యా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు.

మరిన్ని వార్తలు