చికిత్స పొందుతూ ఏఎస్‌ఐ మృతి

3 Dec, 2019 05:37 IST|Sakshi

పహాడీషరీఫ్‌: బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మంచాల ఏఎస్సై కె.నర్సింహ మృతి చెందాడు. నర్సింహ గత నెల 22న ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న విషయం విదితమే. అప్పటి నుంచి కాంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు సోమవారం మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాలాపూర్‌ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా ఘటనకు ముందు నర్సింహ బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లోనే విధులు నిర్వహించేవాడు.

గత నెల 15న బాలాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో తమ బంధువుల విందులో ఉన్నప్పుడు అక్కడికి బాలాపూర్‌ పెట్రోలింగ్‌ వాహనం రావడం, ఏఎస్సై కుమారుడికి పోలీసులతో వాగ్వాదం జరగడం, మధ్యలో నర్సింహా రావడంతో గొడవ జరిగింది. ఆ సమయంలో నర్సింహ దూషించిన వీడియోతో కానిస్టేబుళ్లు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేయడంతో అతన్ని మంచాల ఠాణాకు బదిలీ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన నర్సింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా