కాకతీయ వర్సిటీలో ఉద్రిక్తత

23 Feb, 2018 16:25 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: కాకతీయ వర్సిటీలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీలో పీహెచ్‌డీ సీట్లలో అవకతవకలు జరిగాయని విద్యార్థి సంఘాలు బంద్‌ కు పిలుపునిచ్చాయి. అయితే బంద్‌ కోసం వచ్చిన విద్యార్థి సంఘాలకు, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగి ఇరువర్గాల వారు కొట్టుకున్నారు.

దీంతో పలువురు విద్యార్థలకు గాయాలయ్యాయి. వర్సిటీ అధికారుల సమాచారంతో పోలీసులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థుల ఆందోళన నేపధ్యంలో భారీగా సిబ్బంది మోహరించారు.

మరిన్ని వార్తలు