ఆదివాసీలంటే మావోయిస్టులా ?

28 Mar, 2016 11:44 IST|Sakshi
ఆదివాసీలంటే మావోయిస్టులా ?

రాజకీయ ఖైదీల హక్కుల పోరాట వారోత్సవాల్లో వరవరరావు
 
 సాక్షి, హన్మకొండ: ఆదివాసీలంటే మావోయిస్టులు, మైనార్టీలు అంటే టెర్రరిస్టులు అన్నట్టుగా పాలకులు వ్యవహరిస్తున్నారని విరసం నేతం వరవరరావు ధ్వజమెత్తారు. జై భారత మాత అనాలంటూ ప్రజలపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, అనని వారిపై దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని విమర్శించారు. రాజకీయ ఖైదీల హక్కుల పోరాట వారోత్సవాల్లో భాగంగా ఆదివారం హన్మకొండలో నిర్వహించిన బహిరంగసభలో, అంతకుముందు మీడియూతో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నం దునే వర్సిటీ విద్యార్థులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు.

హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలను ఎన్‌కౌంటర్ల పేరుతో మట్టుబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్‌ప్రవర్తన కలి గిన ఖైదీలను విడుదల చేయాలన్నా రు. హెచ్‌సీయూ వీసీపై దాడి జరిపారంటూ 47 మంది విద్యార్థులపై అన్యాయంగా కేసులు పెట్టారని, అసలు గొడవకు ఆయనే కారణమని అన్నారు. పౌరహక్కుల నేత హరగోపాల్ మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే నేరం, ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహం అన్నట్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు.  రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వర్సిటీల్లో రాజకీయ జోక్యాన్ని జొప్పిస్తోందని ప్రొఫెసర్ మనోరంజన్ మహంతి అన్నారు.

మరిన్ని వార్తలు