టీఎస్‌కేసీలో పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

11 Jul, 2016 17:56 IST|Sakshi

మెదక్: తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్(టీఎస్‌కేసీ)లో ఫుల్‌టైం మెంబర్‌గా పని చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్‌రాజు తెలిపారు. బీటెక్/ఎంటెక్ ద్వితీయ శ్రేణిలో లేదా ఎమ్మెస్సీ(కంప్యూటర్/ఐటీ), ఎంసీఏ/ఎంబీఏ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు రూ.8వేల వేతనం ఇస్తామన్నారు. ఈనెల 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు