కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

19 Apr, 2018 04:35 IST|Sakshi

హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ అధ్యక్షతన జరిగిన కార్మిక మండలి సమావేశంలో నాయిని పాల్గొన్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..11 లక్షల మంది కార్మికులు, 312 ప్రభుత్వ సంస్థలు, 10,012 ప్రైవేటు సంస్థలు భవన, ఇతర నిర్మాణ రంగ కార్మిక మండలిలో నమోదు చేసుకున్నాయని తెలిపారు. ప్రభుత్వం కార్మికులకు వివాహ కానుకలు, మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు ప్రకటించిందన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల ఆర్థిక సాయం, సహజ మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.60 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో పలు రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు