ఏమిటీ ‘పరికరం’!

9 Feb, 2015 05:46 IST|Sakshi
ఏమిటీ ‘పరికరం’!

వ్యవసాయ పొలంలోంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు
తాండూరు: తాండూరు పట్టణంలోని మల్‌రెడ్డిపల్లి కాలనీలో హనుమాన్ ఫంక్షన్ హాలు వెనుక నున్న ఓ రైతు పొలంలో ఆదివారం ఎలక్ట్రానిక్ పరికరం కనిపించింది. పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం పొలంలో ఎలక్ట్రానిక్ పరికరం కనిపించడంతో స్థానికులు గుర్తించి ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పరికరానికి కెమెరా ఉన్నట్లు గుర్తించారు.

కాగా ఈ పరికరాన్ని రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీయడానికి ఉపయోగిస్తారని పోలీసులు తెలిపారు. పరికరంలోని బ్యాటరీలో చార్జింగ్ అయిపోవడంతో పడిపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణ నమోదు వివరాలు తెలుసుకునేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రయోగించి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరం విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని పోలీసులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు