పెళ్లి కావడంలేదని యువకుడు ఆత్మహత్య

4 Nov, 2017 16:41 IST|Sakshi

సాక్షి, చెన్నారావుపేట: ఇన్ని రోజులు పెళ్లికి అందం, ఐశ్వర్యం, పెద్దలు ఒప్పుకోకపోవడం ఇవే కారణం అనుకున్నాం. కానీ లావు అనే పదం కూడా వచ్చి చేరింది. పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువకుడి జీవితంలో లావుగా ఉన్నాడనే కారణం విషాదం నింపింది.దీంతో పెళ్లి కావడం లేదనే మనో వేదనతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. 

వివరాలివి.. జిల్లాలోని చెన్నారావుపేట మండలంలోని ఉప్పెరపల్లి గ్రామానికి చెందిన ఈర్ల రమేష్‌(32) మహారాష్ట్రలోని బీవండిలో పనిచేస్తున్నాడు. చిన్నప్పుడే తండ్రి ఇంటి నుంచి వెళ్లి పోవడంతో కుటుంబాన్ని ఆయనే పోషిస్తున్నాడు. తన ఇద్దరు చెల్లెళ్లకు వివాహాలు చేశాడు. తన వివాహంపై కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ లావుగా ఉన్నాడనే కారణం అతని పెళ్లికి అడ్డుగా వచ్చింది. అందుకే పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావటంలేదని తీవ్ర మనోవేదన చెందేవాడు. దీంతో అతను బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు