నమ్మకమైన జీవితం నాది: అజాంఖాన్

19 Sep, 2013 11:46 IST|Sakshi
నమ్మకమైన జీవితం నాది: అజాంఖాన్

ముజఫర్‌నగర్‌ మతఘర్షణలపై దర్యాప్తు నెమ్మెదిగా చేయాలని ఆదేశించినట్టు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రమంత్రి అజాం ఖాన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ టీవీ చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో ఈ విషయం వెల్లడయింది. అయితే ఈ ఆరోపణలను అజాం ఖాన్‌ తోసిపుచ్చారు. ముజఫర్‌నగర్‌ మతఘర్షణలపై దర్యాప్తు విషయంలో తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. తాను నిజాయితీ, నమ్మకంతో కూడిన జీవితం గడుపుతున్నానని చెప్పారు. తాను ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు.

తన ప్రటిష్ఠను దెబ్బతీసేందుకు సదరు టీవీ చానల్ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. ముజఫర్‌నగర్‌ మతఘర్షణలకు కారణమైన వారిని కాపాడేందుకు తాను ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. తన చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధమన్నారు. ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనుకాడనని చెప్పారు. శూల శోధనలు(స్టింగ్ ఆపరేషన్స్) ప్రజాస్వామ్యానికి మంచివి కావని అజాంఖాన్ అభిప్రాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు