బజాజ్ ఫినాన్స్ బోనస్ బొనాంజా

26 Jul, 2016 13:20 IST|Sakshi
బజాజ్ ఫినాన్స్ బోనస్ బొనాంజా

ముంబై:  బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ బజాజ్ ఫినాన్స్ ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. జూన్ త్రైమాసికంలో  అంచనాలకు మించి ఫలితాలను నమోదు చేసింది.  మంగళవారం  కంపెనీ ప్రకటించిన  క్యూ 1 ఫలితాల్లో 54 శాతం వృద్ధితో రూ.424 కోట్ల నికర లభాలను ఆర్జించింది. ఆదాయంలో 38 శాతం వృద్థితో రూ. 2,166 కోట్ల నికర ఆదాయాన్ని సాధించింది.    
మెరుగైన ఫలితాలను ప్రకటించిన బజాజ్ ఫినాన్స్ బోర్డ్  1:1 బోనస్ ప్రకటించింది. అలాగే 10రూ. గా  ఫేస్  వాల్యూ వున్న  షేరును విడగొట్టి   (స్ప్లిట్) 2 రూ.నిర్ణయించింది. అంటే  ప్రతీ షేరుకు అయిదు షేర్లు అదనంగా   వాటాదారులకు అందించనుంది. దీంతో మార్కెట్లో  ఈ కంపెనీ షేరు లాభాల్లో దూసుకుపోతోంది. ఈ బంపర్ బొనాంజాతో  దాదాపు 5 శాతం  లాభాలతో ఫ్లాట్ గా  ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లో   ప్రధాన విజేతగా నిలిచింది.

కాగా  పుణేకు చెందిన  బజాజ్ ఫినాన్స్  రూ.373కోట్ల నికర లాభాలను, 2039కోట్ల నికర ఆదాయన్ని  నమోదు చేస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. ఈ అంచనాలకు భిన్నంగా  బజాజ్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడం విశేషం.
 

మరిన్ని వార్తలు