274కు చేరిన 'పాకిస్తాన్'మృతుల సంఖ్య

13 Sep, 2014 16:46 IST|Sakshi

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో వరద బీభత్సం లో మృతిచెందిన వారి సంఖ్య 274 కు చేరింది. గత వారం నుంచి పంజాబ్ ప్రావిన్స్‌ను అతలాకుతలం చేసిన వరదలు ఇప్పుడు చారిత్రక ప్రాధాన్యం ఉన్న ముల్తాన్ ప్రాంతాన్నివణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మధ్య పాకిస్థాన్‌లోని అనేక గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. చీనాబ్ నది ఉగ్రరూపం దాల్చడంతో ముల్తాన్‌కు సమీపంలోని అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామాల ప్రజలను రక్షించేదుకు వెయ్యికిపైగా బోట్లు, 16 హెలికాఫ్టర్లను వినియోగిస్తున్నారు.

 

పాకిస్థాన్‌లో వరదల కారణంగా ఇప్పటి వరకూ 274 మంది మృత్యువాతపడగా.. సుమారు 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 194 మంది పంజాబ్ లో చనిపోగా, 66 మంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో అసువులు బాసారు. ప్రస్తుతం వరద ఉధృతి కాస్త తగ్గినా.. అక్కడ సహాయక చర్యలు చేపట్టడానికి తీవ్ర విఘాతం ఏర్పడింది.
 

మరిన్ని వార్తలు