డీఎంకే మేనిఫెస్టో

11 Apr, 2016 04:40 IST|Sakshi
డీఎంకే మేనిఫెస్టో

రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం లక్ష్యంగా ప్రత్యేక చట్టాన్ని డీఎంకే సిద్ధమైంది.
అవినీతి నిర్మూలన లక్ష్యంగా లోకాయుక్త ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నది.
అన్నదాతకు, విద్యార్థులకు రుణమాఫీ, నేతన్నకు  ఉచిత విద్యుత్, జాలర్లకు ఐదు లక్షల గృహాలు, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ నినాదాలతో ప్రజాకర్షణ లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోను డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆదివారం ప్రకటించారు.


* మద్యనిషేధానికి చట్టం
* రాష్ట్రంలో లోకాయుక్త
* రైతన్న, విద్యార్థుల రుణాల మాఫీ
* వరి, చెరకుకు మద్దతు ధర
* నేతన్నకు ఉచిత విద్యుత్
* మళ్లీ పెద్దల సభ , సేతు నినాదం
* జాలర్లకు ఐదు లక్షల గృహాలు
* డీఎంకే మేనిఫెస్టోతో కరుణ ఎన్నికల హామీ
* పాల ధర తగ్గింపు, వృద్ధులకు ఉచిత పయనం
సాక్షి, చెన్నై : అధికార పగ్గాలు చేపట్టాలన్న లక్ష్యంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.

ఎన్నికల మేనిఫెస్టో తయారీకి ఈసారి ప్రత్యేక కమిటీని సైతం రంగంలోకి దించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఈ కమిటీ ప్రజాకర్షణ మేనిఫెస్టోను రూపొందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని వర్గాల్ని కలుపుకుని 72 పేజీలతో కూడిన మేనిఫెస్టోను సిద్ధం చేశారు. అన్నదాతకు, జాలర్లకు, నేతన్నకు, విద్యార్థి లోకానికి, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, గ్రామీణ ప్రజలకు వరాల హామీ గుప్పిస్తూ రూపొందించిన ఈ మేనిఫెస్టోను అన్నా అరివాలయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి విడుదల చేశారు.

డీఎంకే దళపతి స్వాగోతపన్యాసం, మేనిఫెస్టో కమిటీలోని టీఆర్ బాలు, కనిమొళి, వీపీ దురైస్వామి, సుబ్బలక్ష్మి జగదీశన్, టీకేఎస్‌ఇళంగోవన్, ప్రొఫెసర్ రామస్వామి, ఆర్ షణ్ముగ సుందరం, ఎన్‌ఆర్ ఇలంగో, తంగం తెన్నరసులను సత్కరించినానంతరం ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. తొలిప్రతిని డీఎంకే ప్రధాన  కార్యదర్శి అన్భళగన్ అందుకున్నారు. తదుపరి తన ప్రసంగంతో ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన అంశాలను కరుణానిధి ప్రకటించారు. రాజకీయ నాయకుడిగా కాకుండా, ప్రతి కుటుంబంలో సభ్యుడిగా ఈ హామీలను ఇస్తున్నానని వివరించారు.  

ఇందులోని ప్రతి హామీ తప్పనిసరిగా అమలు చేసి తీరుతానని స్పష్టం చేశారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేసి తీరుతామని, ఇందు కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని తొలి హామీగా ప్రకటించారు. టాస్మాక్‌ను రద్దు చేసి,అందులోని కార్మికులకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. రాష్ర్టంలో అవినీతి నిర్మూలన లక్ష్యంగా లోకాయుక్తాను తీసుకొస్తామని, ఇందుకు ప్రత్యేక చట్టం, సేవ హక్కు చట్టం  తీసుకురావడం జరుగుతుందని ప్రకటించారు. అన్నదాతల సంక్షేమార్థం వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
 
మేనిఫెస్టోలోని కొన్ని :
చిన్న, సన్న కారు రైతుల రుణాలన్నీ మాఫీ
వరి క్వింటాల్‌కు రూ. 2,500 మద్దతు ధర, చెరకుకు రూ.3,500
రైతన్నలకు తక్షణం కొత్త విద్యుత్ కనెక్షన్లు. ప్రతి ఏడాది రైతులకు సంక్రాంతి పంచె, చీరతో పాటు రూ.ఐదు వందల నగదు.
100 రోజుల ఉపాధి పథక ం 150 రోజులకు పెంపు
నీటి పారుదలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు
పది వేల కోట్లతో జల వనరుల అభివృద్ధి, రూ. రెండు వేల కోట్లతో చెక్ డ్యాంలు
చెన్నైలో వరద నివారణ మేనేజ్ మెంట్  బోర్డు
జాలర్లకు ఐదు లక్షల గృహాలు, జాతీయ జాలర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి. షెడ్యూల్ ట్రైబ్ జాబితాలోకి జాలర్లు
కాంచీపురంలో పట్టు పార్కు, వేలూరులో లెదర్‌పార్క్. నేతన్నకు 250, 750 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
పది సంవత్సరాలుగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు పర్మినెంట్
ఆటోల కొనుగోలుకు రూ. పదివేల రుణాలు
పారిశుద్ధ్య కార్మికులకు వరద నివారణ సాయంగా రూ. ఐదు వేల నగదు
75 లక్షల మందికి వృత్తి శిక్షణ
25 ఏళ్లు విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ప్రోత్సాహ భత్యం
లక్ష మంది పట్టభద్రులకు స్వయం ఉపాధి నిమిత్త రూ. లక్ష రుణ సాయం
మహిళ ఉద్యోగులకు తొమ్మిది నెలల ప్రసూతి సెలవు.
పాఠశాలల్లో విద్యార్థులకు అదనంగా పౌష్టికాహార నిమిత్తం పాల పంపిణీ
ఆవిన్ పాలు లీటరుకు రూ. ఏడు తగ్గింపు
గ్రానెట్, ఇసుక, దాతు ఇసుకల నిర్వహణ ప్రభుత్వ గుప్పెట్లోకి
విద్యార్థులకు రుణమాఫీ, పేద విద్యార్థులకు ఉన్నత విద్యా ఫీజులు ప్రభుత్వం భరిస్తుంది
పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 54 వేల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ
వృద్ధులకు రూ.1300 పింఛన్, 60 ఏళ్లు పైబడ్డ వారికి బస్సుల్లో ఉచిత పయనం
కుటుంబంలో పెద్ద వారికి పట్టభద్రుడికి ప్రభుత్వ ఉద్యోగం
మదురై -తూత్తుకుడి, చెన్నై - హొసూరు మధ్య పారిశ్రామిక క్యారిడార్
రేషన్‌కార్డులు లేని వారికి పదిహేను రోజుల్లో స్మార్ట్ కార్డు
నెల పొడవునా రేషన్ వస్తువుల పంపిణీ
కారుణ్య ఉద్యోగాల నియామకం తక్షణం
అన్ని జిల్లాల్లో సంక్షేమ హాస్టళ్లు
వికలాంగుల సంక్షేమ బోర్డు ద్వారా ప్రత్యేక రాయితీల పెంపు
రోడ్డు సైడ్ వ్యాపారులు, మోత వ్యాపారులకు రూ. రెండు వేలు వడ్డీ లేని రుణం
కేంద్ర ఏడో వేతన కమిషన్ వలే, రాష్ట్రంలో ఎనిమిదో వేతన కమిషన్
ప్రజా సంక్షేమ సిబ్బందికి కుటుంబ నిర్వహణకు ఐదు లక్షల వరకు రుణం
పేద యువతుల వివాహానికి రూ. 60 వేల సాయం, నాలుగు గ్రాముల బంగారం
కుమరి, మదురై, నెల్లైలో పరిశోధన కేంద్రాలు
మళ్లీ రాష్ర్టంలో శాసన మండలి పునరుద్ధరణ
అన్నా క్యాంటీన్లు, తాజాగా, తుంగలో తొక్కబడ్డ పథకాలన్నీ మళ్లీ పునరుద్ధరణ
గుడిసెల రహిత రాష్ట్రం లక్ష్యం. గ్రామాల్లో కాంక్రీట్ ఇళ్లకు రూ. మూడు లక్షల సబ్సిడీ
సముద్ర తీర జిల్లాల్లో నిర్లవరణీ కరణ పథకం
ప్రతి నియోజకవర్గంలో మూడు నెలలకు ఓ మారు ప్రజా ఫిర్యాదులు, వినతి పత్రాల స్వీకరణ కార్యక్రమాలు
జల్లికట్టు, మంజు వీరాట్, రెక్లాల అనుమతికి చర్యలు
కుడంకులం అణు ఉద్యమ కారులపై కేసులన్నీ ఎత్తివేత
చెన్నై మెట్రో రైలు శ్రీ పెరంబదూరు వరకు విస్తరణ, తిరుచ్చి మదురై, కోయంబత్తూరులో మెట్రో రైలు సేవలు
సేవా హక్కు చట్టం
మళ్లీ సేతు సముద్రం ప్రాజెక్ట్
నమ్మాళ్వార్ కృత్రిమ వ్యవసాయ కేంద్రం

మరిన్ని వార్తలు