వ్యాయామం చేస్తే మంచి మార్కులు!!

22 Oct, 2013 14:01 IST|Sakshi
వ్యాయామం చేస్తే మంచి మార్కులు!!

క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకు రావాలనుకుంటున్నారా? పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించాలని ఉత్సాహంగా ఉందా? అయితే.. వెంటనే వ్యాయామం మొదలుపెట్టండి. అవును.. టీనేజిలో ఉన్న అమ్మాయిలు ప్రతిరోజూ కాస్తంత వ్యాయామం చేస్తే.. వాళ్లకు సైన్సులో మంచి మార్కులు వచ్చే అవకాశం పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది. వ్యాయామం ఎంత ఎక్కువగా చేస్తే, వాళ్ల పరీక్ష ఫలితాల్లో అంత ఎక్కువ ప్రభావం ఉంటోందని పరిశోధకులు తెలిపారు.

5వేల మంది పిల్లల మీద పరిశోధన చేసిన తర్వాత ఈ విషయాన్ని నిర్ధరించుకున్నారు. 1991 నుంచి 1992 వరకు ఇంగ్లండ్లో పుట్టిన 14వేల మంది పిల్లల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని గమనించి మరీ ఈ విషయాన్ని తేల్చారు. యాక్సెలరోమీటర్ అనే పరికరాన్ని వారికి అమర్చి మూడునుంచి ఎనిమిది రోజుల వరకు వారి వ్యాయామాల తీరును లెక్కించారు. ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు సబ్జెక్టులలో వారికి వచ్చిన మార్కులు చూడగా.. సైన్సు మార్కులలో మంచి మెరుగుదల కనిపించింది. అందులోనూ అమ్మాయిలకు ఈ మార్కుల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు