జియోతో 4జీ విప్లవం: ఐడీసీ

12 Dec, 2016 15:17 IST|Sakshi
జియోతో 4జీ విప్లవం: ఐడీసీ

న్యూఢిల్లీ: ఉచితవాయిస్ కాల్స్, ఉచిత 4 జీ డేటాలతో  టెలికాం ఇండస్ట్రీలో  ప్రకంపనలు రేపిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో సంచలనానికి నాంది పలకనుంది.  జియో ఉచిత 4జీ సిమ్ కార్డులు, తక్కువ ధరలకే 4జీస్మార్ట్ ఫోన్ల నేపథ్యంలో 4 జీ విప్లవానికి భారతదేశం అగ్రస్థానంలో నిలవనుందని ఇంటర్నేషనల్  డాటా కార్పేరేషన్  ఒక ప్రకటనలో తెలిపింది.  తదుపరి బిలియన్  ఖాతాదారుల  లక్ష్యంతో ప్రారంభించిన  4జీ  స్మార్ట్ ఫోన్లతో  ఇండియా లాంటి కీలకమైన మార్కెట్లలో 4జీ విప్లవానికి దారులు  వేసిందని  ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) బుధవారం వెల్లడించింది . ప్రపంచ వ్యాప్తంగా  4జీ స్మార్ట్ ఫోన్ల వినియోగంలో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు కానుందని తెలిపింది.  2016లో  21.3 శాతం వృద్ధితో  1.17 బిలియన్ యూనిట్ల చేరనుందని తెలిపింది. 2015 లో 967 మిలియన్లుగా ఉందని పేర్కొంది. కొత్త  ఆపరేటర్  రిలయన్స్ జియో ప్రవేశంతో ఇండియా లాంటి కీలక మార్కెట్లలో వేగవంతమైన అభివృద్ధిని చూస్తున్నట్టు  వ్యాఖ్యానించింది.  ఉచిత సిమ్ కార్డులు, తక్కువ ధరలకే సొంత బ్రాండెడ్  4జీస్మార్ట్ ఫోన్లతో దూకుడుగా ఎంట్రీ ఇచ్చిన జియో మార్కెట్ ను  షేక్ చేస్తోందని అసోసియేట్ రిసెర్చ్ డైరెక్టర్  మెలిస్సా చౌ చెప్పారు .

కాగా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ వాణిజ్యపరంగా సెప్టెంబర్ 5న  జియో  సేవలను లాంచ్ చేశారు. సుమారు  3,100 నగరాలు, పట్టణాలు అంతటా ఆధార్ ఆధారిత  సేవలు ప్రారంభించారు. దీంతో జియో వినియోగదారులకు డిసెంబర్ 31 వరకు అపరిమిత హెచ్డీ  వాయిస్ కాల్స్ హై  స్పీడ్  డేటా ను ఉచితంగా అందిస్తున్న  సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు