షూలో వజ్రాల సంచులు..

22 Mar, 2017 15:55 IST|Sakshi

 చైనా: బూట్లలో 1000పైగా వజ్రాలను  అక్రమంగా రవాణా చేస్తూ ఓ యువకుడు అడ్డంగా దొరికిపోయాడు. హాంగ్‌ కాంగ్‌ సిటీ నుంచి షెన్జెన్‌  నగరానికి ప్రవేశిస్తుండగా కస్టమ్స్‌ అధికారులకు చిక్కాడు.

వివరాల్లోకి వెళితే..షూ వేసుకున్న యువకుడు సాధారణనడకకు భిన్నంగా అడుగులు  ఎత్తి ఎత్తివేస్తూ అధికారుల కంటబడ్డాడు.  అధికారులు గమనిస్తూ ఉండడటంతో మళ్లీ మామూలుగా నడవడానికి  ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ నిర్వహించారు. దీంతో  సాక్స్‌ లోదాచిన డైమండ్‌ బ్యాగులు  బయటపడ్డాయి.  212.9 క్యారెట్ల  సుమారు  వెయ్యిగాపైగా వజ్రాలను స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్‌ అధికారి వాంగ్‌​ తెలిపారు.అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.  దర్యాప్తు కొనసాగుతుందన్నారు. గతంలో లువోహుకు పోర్ట్ లో అల్పాహారం ఆహార ప్యాకేజీలో  164 క్యారెట్ల బరువున్న 1,554 వజ్రాలను స్మగ్లింగ్‌ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి  తీసుకున్నట్టు లువోహుకు పోర్ట్  అధికారులు ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు