ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్తో రిలయన్స్ భారీ డీల్‌

30 Jan, 2017 12:58 IST|Sakshi
ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్తో రిలయన్స్ భారీ డీల్‌

ముంబై: పారిశ్రామిక వేత్త అనిల్‌ ​అంబానీ నేతృత్వంలోని  రిలయన్స్ డిఫెన్స్‌ , ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్  తో భారీ డీల్‌ కుదుర్చుకుంది.  భారత తీర రక్షక దళం(ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌) నుంచి రూ. 916 కోట్ల విలువైన కాంట్రాక్టును పొందినట్లు  రిలయన్స్ డిఫెన్స్‌  మార్కెట్‌  ఫైలింగ్‌ లో  తెలిపింది. ఒక ప్రైవేటు రంగ షిప్‌ యార్డ్‌తో ప్రభుత్వం ఇలాంటి ఒప్పందం చేసుకోవడం ఇదే మొదటిసారి.  

14 ఫాస్ట్ పెట్రోల్ ఓడల నిర్మాణానికి ఈ డీల్‌ కుదుర్చుకున్నట్టు అనిల్‌ అంబానీ సోమవారం ప్రకటించారు.  ఈ  కాంట్రాక్టులో భాగంగా 14 మీడియం,  హై  స్పీడ్‌  పేట్రోల్‌ వెస్సల్స్‌ను సరఫరా చేయాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది.  తీరప్రాంతాల్లో నిఘా,   యాంటీ స్మగ్లింగ్ వ్యతిరేక ,  యాంటీ పైరసీ,  సెర్చ్‌,  రెస్క్యూ ఆపరేషన్స్‌లో వీటిని వినియోగించనున్నట్టు చెప్పారు. మాడ్యులర్  కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీలో గణనీయమైన నైపుణ్యం తో కమర్షియల్‌, వినియోగం నౌకాదళాంలో  వినియోగంకోసం పెద్ద ఓడల్ని నిర్మిస్తున్న  దేశంలో అతిపెద్ద  షిప్‌ యార్డ్‌  రిలయన్స్ డిఫెన్స్‌ .   మరోవైపు ఫ్రంట్ లైన్ సంస్థలులార్సన్ అండ్ టుబ్రో, కొచ్చిన్ షిప్‌ యార్డ్‌,  గోవా నౌకా నిర్మాణ కేంద్రం,  గార్డెన్ రీచ్ షిప్‌ బిల్డర్స్‌  ఇంజనీర్స్ సహా ప్రాజెక్ట్ కోసం బిడ్ వేయగా రిలయన్స్‌ ఈ ఆర్డర్‌ను చేజిక్కించుకోవడం విశేషం.

ఈ ఒప్పంద వార్తలతో  మార్కెట్లో ఈ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. రిలయన్స్‌ డిఫెన్స్‌ షేరు దాదాపు 6 శాతం జంప్‌చేసింది.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు