గీతను కలుస్తా: సల్మాన్ ఖాన్

10 Aug, 2015 19:02 IST|Sakshi
గీతను కలుస్తా: సల్మాన్ ఖాన్

ముంబై: భారత్ నుంచి తప్పిపోయి పాకిస్తాన్‌కు చేరిన మూగ చెవిటి అమ్మాయి గీతను తన తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మద్దతు తెలిపాడు. తన సొంత తల్లిదండ్రులను కలుసుకోవాలని ఆమె కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుందని అన్నాడు.

స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత తనను కలవాలనుకుని గీత అనుకుంటే ఆమెను కలుస్తానని సల్మాన్ హామీయిచ్చాడు. 15 ఏళ్ల పాటు పాకిస్థాన్ లో ఆమెకు ఆశ్రయం కల్పించిన స్వచ్ఛంద సంస్థకు థ్యాంక్స్ చెప్పాడు. అతడు నటించిన 'బజరంగీ భాయిజాన్' సినిమా హిట్ కావడంతో గీత ఉదంతం వెలుగులోకి వచ్చింది.

కాగా గీత తమ కూతురేనని ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామానికి చెందిన జజ్జర కృష్ణయ్య, గోపమ్మ చెబుతున్నారు. పంజాబ్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన నాలుగు కుటుంబాలు కూడా గీత తమ కూతురేనని చెబుతున్నాయి.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు