భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

18 May, 2017 15:47 IST|Sakshi
ముంబై:  అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, రుపీ దెబ్బ నేపథ్యంలో దేశీయ స్టాక్‌మార్కెట్లు  వెనక్కి తగ్గాయి. ఇటీవల రికార్డ్‌ స్థాయి లాభాలతో  దూసుకుపోయిన  బెంచ్‌మార్క్‌ సూచీలు గురువారం వెనక్కి తగ్గాయి.    ఆరంభంలోనే బలహీనపడిన సెన్సెక్స్‌ 224  పాయింట్ల నష్టంతో 30,234 వద్ద, నిఫ్టీ 96 పాయింట్ల నష్టంతో 9429వద్ద ముగిసింది.  భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది.   దాదాపు అన్ని సెక్టార్లు నష్టపోగా, ఐటీ, ఫార్మ స్వల్పంగా లాభపడింది.  రిలయన్స్‌,  ఐడిబిఐ,బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా,  హెచ్‌సీయుల్‌, ఎస్‌బీఐ, బోష్‌, వేదాంత  నష్టపోయాయి.  సన్‌ ఫార్మా, ఇన్ఫోసిస్‌ లాభపడిన వాటిల్లో ఉన్నాయి.   
అటు డాలర్‌మారకంలో రుపీ  బాగా నష్టపోయింది. 0.71 పైసల నష్టంతో రూ.64.87 వద్ద,  ఎంసీఎక్స్‌ లో పుత్తడి పది గ్రా రూ. 300 ఎగిసి రూ. 28,919వద్ద ఉంది.
 
మరిన్ని వార్తలు