సారీ ట్రంప్.. మీ అంచనాలు తప్పు!

18 Nov, 2016 15:10 IST|Sakshi
అమెరికా అగ్రపీఠాధ్యక్ష ఎన్నికల్లో తను గెలిచినప్పటికీ, కవరేజీ సరిగా చేయనందున్న న్యూయార్స్ టైమ్స్ పత్రిక పాఠకులను తీవ్రంగా కోల్పోవాల్సి వస్తుందంటూ తెగ విమర్శలు గుప్పించిన డొనాల్డ్ ట్రంప్కు ఆ పత్రిక  షాకిచ్చింది. సారీ డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల నుంచి తమ చెల్లింపు సభ్యత్వాలు బాగా పెరిగాయంటూ న్యూయార్క్ టైమ్స్ ట్రంప్ లెక్కలను కొట్టిపారేసింది. ప్రధాన స్రవంతి మీడియా తన గురించి కవరేజి విషయంలో చాలా దారుణంగా ఉందని, ఈ ఎఫెక్ట్తో ఆ పత్రిక వేలకొలదీ పాఠకులను కోల్పోవాల్సి వస్తుందని ఆదివారం ట్రంప్ ట్వీట్ల వర్షం కురిపించారు. అమెరికా ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఆరుసార్లు ఆ పత్రిక కవరేజీపై ట్రంప్ మండిపడ్డారు. ముఖ్యంగా తన కవరేజీ విషయంలో చాలా పక్షపాత ధోరణితో ఆ పత్రిక వ్యవహరిస్తుందంటూ విమర్శించారు.
 
ఆ విమర్శలను కొట్టిపారేస్తూ న్యూయార్క్ టైమ్స్, తన పత్రికకు, డిజిటల్ న్యూస్ ప్రొడక్ట్స్కు ఈ వారంలో దాదాపు 41 వేల చెల్లింపు సభ్యత్వాలు నమోదయ్యాయంటూ శుక్రవారం వెల్లడించింది. డిజిటల్ సబ్స్క్రిప్షన్ మోడల్ సర్వీసులను ఆవిష్కరించిన అనంతరం 2011 నుంచి ఈ వారంలోనే అత్యధికంగా సబ్స్క్రైబర్లు నమోదయ్యారని తెలిపింది. నవంబర్ మొదట్లో మూడో క్వార్టర్లో ఈ పత్రిక తన ప్రకటనా ఆదాయాలను భారీగా కోల్పోయిన సంగతి తెలిసిందే. కానీ ఆ కాలంలోనే డిజిటల్ న్యూస్ సబ్స్క్రిప్షన్ బాగా పెరిగినట్టు వెల్లడించింది. 116,000 మంది కొత్త పాఠకులను చేర్చుకుని, మొత్తం 1.3 మిలియన్ సభ్యత్వాలను సొంతంచేసుకున్నట్టు పేర్కొంది.  
 
మరిన్ని వార్తలు