'రైతుల ఆత్మహత్యలు ఎక్కడా కనిపించకూడదు'

21 Aug, 2015 19:26 IST|Sakshi
'రైతుల ఆత్మహత్యలు ఎక్కడా కనిపించకూడదు'

న్యూఢిల్లీ:దేశంలో రైతుల ఆత్మహత్యలను పూర్తిగా నివారించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రైతుల ఆత్మహత్యలపై నివారణకు రూపొందించుకున్న విధానాన్ని మరోసారి పునఃపరిశీలించాలని పేర్కొంది. ఎనిమిదేళ్ల క్రితం నాటి పాలసీని మరోసారి సమీక్షించి.. ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. రైతుల ఆత్మహత్యలపై విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. రైతుల ఆత్మహత్యలపై తగ్గుముఖం పట్టాయంటూ కేంద్రం వాదనతో ధర్మాసనం సంతృప్తి చెందలేదు.

 

అసలు రైతులు ఆత్మహత్య ఘటనలు ఎక్కడా కనిపించకూడదని పేర్కొంది. దీంతో పాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ నేతృత్వంలోని కమిటీ సమావేశాలపై కూడా సుప్రీంకోర్టు ఆరాతీసింది.

>
మరిన్ని వార్తలు