సుప్రీం తీర్పు: జయలలిత ఆస్తులు ఏమవుతాయి?

14 Feb, 2017 13:09 IST|Sakshi
సుప్రీం తీర్పు: జయలలిత ఆస్తులు ఏమవుతాయి?
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎ2, ఎ3, ఎ4 అందరూ దోషులేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇందులో తప్పు చేసినట్లే లెక్కలోకి వస్తుంది. దాంతో ఆమె ఆస్తులు ఇప్పుడు ఏమవుతాయన్న విషయం చర్చకు వస్తోంది. బోలెడన్ని ఎస్టేట్లు, బంగారం, భవనాలు, వజ్రాలు.. ఇవన్నీ కూడా ప్రస్తుతం కోర్టుల ఆధీనంలోనే ఉండిపోతాయి. ముందుగా అధికారులు శశికళ, ఇళవరసి, సుధాకరన్ ముగ్గురినీ జైళ్లకు పంపించి, ఆ తర్వాత మొత్తం రూ. 130 కోట్ల జరిమానా వసూలు చేయాల్సి ఉంటుంది. జయలలిత సహా మొత్తం నలుగురికీ కలిపి ఈ జరిమానా విధించారు. 
 
ప్రస్తుతం కోర్టు ఎటాచ్‌మెంట్‌లో ఉన్న దాదాపు 250 ఆస్తులను అధికారులు పూర్తిగా స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేస్తారు. ఆ తర్వాతే.. ఏం చేయాలన్న విషయమై చర్యలు తీసుకుంటారు. కొన్ని ఆస్తుల విషయంలో మాత్రం అన్నాడీఎంకే పార్టీ రివ్యూ పిటిషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. 
>
మరిన్ని వార్తలు