బాపట్ల కేంద్రంగా భావపురి జిల్లా

4 Aug, 2021 11:30 IST|Sakshi
జన్మదినం సందర్భంగా కోన రఘుపతికి కేక్‌ తినిపిస్తున్న సతీమణి

అభివృద్ధి అంటే ఏమిటో రెండేళ్లల్లోనే చూపించాం

ప్రజల హృదయాల్లో కోన కుటుంబానికి చెరగని ముద్ర

ఉప సభాపతి కోన రఘుపతి

బాపట్ల: ‘బాపట్ల కేంద్రంగా భావపురి జిల్లాను తీసుకువస్తా.... అభివృద్ధి అంటే ఏమిటో రెండేళ్ళులోనే చేసిచూపించాం... ఇంకా అభివృద్ధే ధ్యేయంగా ముందుకుపోతాం....ప్రజల హృదయాల్లో కోన కుటుంబానికి చెరగనిముద్ర ఉంది...ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా  ప్రజల కన్నీటి కష్టాలు తీర్చేటమే తుదిశ్వాసగా నిలుస్తానంటూ.. డెప్యూటీ స్పీకర్‌  కోన రఘుపతి పేర్కొన్నారు. మంగళవారం తన నివాసంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. పార్టీ నాయకులు,అధికారులు, ప్రజలు,కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పోటీలుపడ్డారు. కోన నివాసం నుంచి డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ఆయన సతీమణి రమాదేవిని గుర్రపుబండిపై ఊరేగించారు.

స్థానిక రధంబజారులో 700 కిలోల భారీ కేక్‌ను  కోన రఘుపతి కట్‌ చేసిన అనంతరం మాట్లాడుతూ.. బాపట్ల ప్రాంతాన్ని టెంపుల్‌టౌన్‌గా అభివృద్ధి చేసి తీరుతామని చెప్పారు. పర్యాటక అభివృద్ధితోపాటు ప్రతి సమస్యను తన భుజంపై వేసుకుని పరిష్కారిస్తున్నానని చెప్పారు. కార్యక్రమాల్లో వైఎస్సార్‌ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరరావు, కోకి రాఘవరెడ్డి, విన్నకోట సురేశ్‌ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ విన్నకోట సురేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఏ భానుప్రతాప్, డీఎస్పీ ఏ శ్రీనివాసరావు, ఎంపీడీఓ రాధాకృష్ణ, మార్కెట్‌యార్డు చైర్మన్‌ గవిని కృష్ణమూర్తి, నాయకులు షేక్‌.బాజీ, ఎస్‌.నారాయణరావు, ఇ.విజయశాంతి, పి.శ్రీనివాసరావు  పాల్గొన్నారు. 

కర్లపాలెం: ఏపీ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి జన్మదిన వేడుకలు మంగళవారం మండల పరిధిలోని పలు గ్రామాలలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కర్లపాలెంలో జరిగిన కోన జన్మదిన వేడుకలలో వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ దొంతిబోయిన సీతారామిరెడ్డి పాల్గొని కేక్‌ కట్‌చేసి కార్యకర్తలకు తినిపించారు. దుండివారిపాలెంలో సర్పంచ్‌ పులుగు గోవిందమ్మ మునిరెడ్డి రామాలయం వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోన రఘుపతి జన్మదిన కేక్‌ను కట్‌చేసి కార్యకర్తలకు పంచారు. చింతాయపాలెం, పేరలి, యాజలి గ్రామాలలోని కార్యకర్తలు కోన రఘుపతి జన్మదిన కార్యక్రమాలు జరిగాయి.

మరిన్ని వార్తలు