అర్ధరాత్రి రోడ్డుపై ఒంటరిగా యువతి.. బిక్కుబిక్కుమంటూ..

6 Nov, 2021 06:54 IST|Sakshi
స్వాతి 

అర్ధరాత్రి రోడ్డుపై మూగ, చెవిటి యువతి

స్నేహితుడు వదిలివెళ్లిన వైనం

రక్షించిన నల్లపాడు పోలీసులు

మహిళా ప్రాంగణానికి తరలింపు

గుంటూరు రూరల్‌: మనసులోని బాధను ఎవ్వరితోనూ చెప్పుకోలేదు. తాను ఎక్కడుందో ఆమెకే తెలియదు. ఎందుకు వచ్చిందో తెలియదు, ఎదుటివారు ఏమి మాట్లాడుతున్నారో ఆమెకు వినపడదు, అటువంటి మూగ, చెవిటి యువతి అర్ధరాత్రి ఒంటరిగా జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–16)పై బిక్కుబిక్కుమంటూ నిలబడగా ఆమెను నల్లపాడు పోలీసులు రక్షించి మహిళా ప్రాంగణానికి తరలించారు. నగరమంతా దీపావళి వేడుకలు నిర్వహించుకుంటోంది. విధి నిర్వహణలో నల్లపాడు పోలీసులు విజుబుల్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తున్నారు.

చదవండి: వివాహేతర సంబంధం, హత్య కేసు.. నిందితుడిని పట్టించిన ‘చెప్పు’

ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో ఒక యువతి రోడ్డుపై నిలబడటం చూసి ఎందుకున్నావని సీఐ ప్రేమయ్య పలకరించారు. దీంతో ఆమె తనకు మాటలు రావని, చెవుడని సైగల ద్వారా తెలిపింది. ఆమె సైగల ద్వారా ఆమె నెల్లూరుకు చెందిన స్వాతిగా గుర్తించారు. ఎందుకు వచ్చావని ప్రశ్నించగా తన స్నేహితుడు లారీలో తెచ్చి, ఇక్కడ వదిలి వెళ్లాడని తెలిపింది. దీంతో విషయం అర్థం చేసుకున్న సీఐ ఆమెను నగరంలోని మహిళా ప్రాంగణానికి తరలించి ఆమె బంధువులకు సమాచారం అందించారు. దీంతో ఆమె బంధువులు నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు శుక్రవారం రాత్రి చేరుకున్నారు. వారిని విచారించి ఆమెను ఇంటికి పంపనున్నట్లు సీఐ తెలిపారు. అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపై ఉన్న యువతిని కాపాడిన సీఐను స్థానికులు, ప్రజలు అభినందించారు.

చదవండి: జూబ్లీహిల్స్‌: డ్రస్సింగ్‌ రూంలో మహిళల న్యూడ్‌ వీడియోలు చిత్రీకరణ

మరిన్ని వార్తలు