ఏపీలో సమగ్ర పరిశ్రమ సర్వే: గౌతమ్‌రెడ్డి

17 Sep, 2020 12:46 IST|Sakshi

ఐదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటుకు కేంద్ర సంస్థలు అంగీకారం

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో సమగ్ర పరిశ్రమ సర్వే చేశామని పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటుకు కేంద్ర సంస్థలు అంగీకరించాయని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ ఛైర్మన్ ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని అభినందించారని తెలిపారు. 8 ఫిషింగ్‌ హార్బర్ల అభివృద్ధికి కేంద్ర సహకారం ఉంటుందని ఆయన చెప్పారని గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. (చదవండి: 3 ప్రముఖ సంస్థలతో ‘స్కిల్స్‌’పై ఒప్పందాలు)

‘‘డిసెంబర్ నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. బల్క్ డ్రగ్ పార్క్‌ని ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. డిసెంబర్ 15 నాటికి భావనపాడు, రామాయపట్నం పోర్టుల పనులు ప్రారంభిస్తామని’’తెలిపారు. విశాఖలో ఐటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరల్డ్‌ క్లౌడ్‌ సెంటర్‌ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. వర్క్ ఫ్రం హోమ్‌కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని’’ మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. (చదవండి: బాబోయ్‌ జంగారెడ్డిగూడెం పోలీస్‌ స్టేషనా..!)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా