రూ.635.21 కోట్లతో అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ

28 Dec, 2022 04:22 IST|Sakshi
అన్నమయ్య ప్రాజెక్టు (ఫైల్‌)

టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన జలవనరుల శాఖ

పనుల పూర్తికి రెండేళ్లు గడువు

జనవరి 10లోగా షెడ్యూలు దాఖలుకు అవకాశం

17న ఆర్థిక బిడ్‌.. అదే రోజున రివర్స్‌ టెండరింగ్‌

తక్కువ ధరకు కోట్‌చేసిన సంస్థకు పనుల అప్పగింత

సాక్షి, అమరావతి: గతేడాది నవంబర్‌ 19న చెయ్యేరుకు వచ్చిన ఆకస్మిక భారీ వరదలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరించే పనులకు రూ.635.21 కోట్ల అంచనాతో జలవనరులశాఖ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. లంప్సమ్‌–ఓ­పెన్‌ విధానంలో రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తిచేయాలని షరతు విధించింది. జనవరి 10వ తేదీలోగా టెండర్‌లో పాల్గొనేందుకు షెడ్యూలు దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది.

ఆర్థిక బిడ్‌ను జనవరి 17న ఉదయం 11 గంటలకు తెరిచి, మధ్యాహ్నం 2.30 గం­టల నుంచి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహి­స్తా­రు. తక్కువ ధరకు కో­ట్‌ చేసిన కాంట్రాక్టు సంస్థకు టెండర్‌ అప్పగించా­లని స్టేట్‌ లెవల్‌ టెక్నికల్‌ కమిటీ (ఎస్‌.ఎల్‌.టి.సి.)కి ప్రతిపాదనలు పంపుతారు. కాంట్రాక్టు సంస్థ అర్హతలను మరో­సారి పరిశీలించి, నిబంధనల ప్రకారం టెండర్‌ను ఎస్‌.ఎల్‌.టి.సి. ఆమోదిస్తుంది. తర్వా­త కాంట్రాక్టు సంస్థకు పనులు అప్ప­గిస్తూ జల­వనరుల శాఖ ఒప్పందం చేసుకుంటుంది.

అ­ధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో
అన్నమయ్య జిల్లా­లో రాజంపేట మండలంలోని బాదనగడ్డ వద్ద చె­య్యే­రుపై దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును 2.24 టీఎంసీల సామర్థ్యంతో పునరుద్ధరించేలా పనులను కాంట్రా­క్టు సంస్థ చేపడుతుంది. చెయ్యేరుకు భారీ వరద వచ్చినా చెక్కుచెదరకుండా నిలబడేలా అ­ధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్నమయ్య ప్రా­­జెక్టు పునరుద్ధరణ పనులను ప్రభుత్వం చేపట్టింది. 

మరిన్ని వార్తలు