‘ఉత్తరాంధ్రకు ఏమీ వద్దని చేస్తున్న యాత్ర ఇది’

11 Sep, 2022 17:07 IST|Sakshi

శ్రీకాకుళం:  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో పాదయాత్ర చేయడానికి సిద్ధపడటం ఎందుకోసమని ప్రశ్నించారు ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం. అసలు మూడు రాజధానులతో చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. కేవలం ఓ సామాజిక వర్గానికి న్యాయం చేయాలనుకుంటున్నారా చంద్రబాబు అని నిలదీశారు స్పీకర్‌. ఆదివారం స్పీకర్‌ తమ్మినేని మీడియాతో మాట్టాడారు. దీనిలో భాగంగా ఉత్దరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు మళ్లీ అడ్డుపడుతున్నారని తమ్మినేని మండిపడ్డారు.

‘అమరావతిలో వేరే వర్గాలు నివసించకూడదా?. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశారు.  ఓటుకు నోటు కేసులో దొరికినా బుద్ధి రాలేదు. ఉద్రిక్తతను రెచ్చగొట్టడానికే పాదయాత్ర చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు ఏమీ వద్దని చేస్తున్న యాత్ర ఇది. అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలన్నదే బాబు లక్ష్యం. ఒకే రాజధాని ఉండటంతో విభజన సమయంలో నష్టపోయాం. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకూడదు.అన్ని రంగాల్లోనూ ఎంతో నష్టపోయాం.మరోసారి వేర్పాటువాదంతో ఏపీ నష్టపోకూడదు.మూడు రాజధానులతోనే రాష్ట్రమంతటా అభివృద్ధి.వికేంద్రకరణతో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది. 

రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దా?, రాజధానిలో పేదలు ఎందుకు నివసించకూడదు. నాలుగేళ్ల పంట నష్టం ఎగ్గొట్టింది చంద్రబాబే. రైతులకు విత్తనాలు బకాయిలు కూడా చంద్రబాబు ఇవ్వలేదు. చంద్రబాబు దురాలోచనకు ఎల్లో మీడియా వత్తాసు. ఉత్వరాంధ్ర ప్రజానీకమంతా గమనించాలి. ఈ అంశంపై మాట్లాడే హక్కు స్పీకర్‌గా నాకుంది. గత ప్రభుత్వంలో పధకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. రాజకీయాల్లో విశ్వసనీయతకు అసలైన ఉదాహరణ సీఎం జగన్‌. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు. కల్యాణమస్తు పథకంలో 98.4 శాతం హామీలు సీఎం జగన్‌ నెరవేర్చారు. పేదింటి ఆడపిల్లల వివాహానికి అండగా సీఎం జగన్‌ నిలిచారు. వధూవరులకు కనీస అర్హత 10వ తరగతి ఉండాలి. 10వ తరగతి కనీస అర్హతపై జీవో ఇస్తాం. పేదింటి ఆడపిల్లలకు ప్రభుత్వం బాసటగా నిలబడుతుంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పాలన చూడలేదు.పేదింటి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎన్నో ఇబ్బందులు. అలాంటి కుటుంబాలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు ఎంతో అండ’ అని తమ్మినేని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు