క‌ల్ప‌వృక్ష వాహ‌నంపై‌ మలయప్ప

19 Oct, 2020 10:34 IST|Sakshi

సాక్షి, తిరుమల: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు క‌ల్ప‌వృక్ష వాహనంపై రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో అభ‌య‌మిచ్చారు. క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చారు.ఈ రోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స‌ర్వ‌భూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మివ్వనున్నారు. 

చదవండి: తిరుపతి బండికి ఎగనామం  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు