గ్రహం అనుగ్రహం (26-10-2020)

26 Oct, 2020 06:11 IST|Sakshi

మేషం: ఎంతటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. భూవ్యవహారాలలో కొత్త ఆశలు. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృషభం: కొన్ని వ్యవహారాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మిథునం: పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కర్కాటకం: పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. బంధువర్గంతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఒత్తిడులు.

సింహం: పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా సాగుతారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కన్య: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం. శుభవార్తలు. రుణబాధలు తొలగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది.  దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

తుల: దూరప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. కొత్తగా రుణయత్నాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం తగ్గుతుంది.

వృశ్చికం: ప్రయాణాలలో మార్పులు. స్వల్ప అనారోగ్యం. శ్రమాధిక్యం. ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. రుణదాతల ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. రుణబాధలు తొలగుతాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మకరం: కుటుంబసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు.

కుంభం: పనులలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

మీనం: కొన్ని సమస్యలు సవాలుగా మారతాయి. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ముఖ్యమైన పనులు వాయిదా. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా