భారత్‌ మార్కెట్‌లో జపాన్‌ టీవీ, ధర ఎంతంటే!

7 Jul, 2022 07:50 IST|Sakshi

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: కంజ్యూమర్‌ ఎల్రక్టానిక్స్‌ తయారీలో ఉన్న జపాన్‌ కంపెనీ ఐవా తాజాగా భారత మార్కెట్లో మ్యాగ్నిఫిక్‌ పేరుతో స్మార్ట్‌ టీవీలను ప్రవేశపెట్టింది. ఫుల్‌ హెచ్‌డీ, అల్ట్రా హెచ్‌డీ, 4కే యూహెచ్‌డీ టీవీలను 32–65 అంగుళాల సైజులో రూ.29,990 నుంచి రూ.1,39,990 ధరల శ్రేణిలో అందుబాటులోకి తెచ్చింది. 

బిల్ట్‌ ఇన్‌ గూగుల్‌ అసిస్ట్, ఆరి్టఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్‌–4 ప్రాసెసర్, ఆన్‌డ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో రూపుదిద్దుకున్నాయి. ఇన్‌బిల్ట్‌ సౌండ్‌ బార్‌ 55, 65 అంగుళాల టీవీల ప్రత్యేకత. దేశవ్యాప్తంగా 300 రిటైలర్స్‌ ద్వారా టీవీలను విక్రయించనున్నట్టు ఐవా ఇండియా ఎండీ అజయ్‌ మెహతా వెల్లడించారు.‘ఏడాదిలో రిటైలర్ల సంఖ్యను 3,500లకు చేరుస్తాం. వ్యాపార విస్తరణకు రెండేళ్లలో రూ.160 కోట్లు ఖర్చు చేస్తాం.

భారత్‌లో టీవీల తయారీకై డిక్సన్‌ టెక్నాలజీస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీవీలు, ఆడియో ఉత్పత్తుల అమ్మకాల ద్వారా రూ.400 కోట్ల టర్నోవర్‌ ఆశిస్తున్నాం. 4–5 ఏళ్లలో రూ.8,000 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా చేసుకున్నాం. ఇందుకు వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి ఉత్పత్తులను ప్రవేశపెడతాం’ అని వివరించారు. 1951లో ఐవా ప్రారంభమైంది. ఈ సంస్థ భారత్‌లో 2021 ఏప్రిల్‌లో రీ–ఎంట్రీ ఇచ్చింది. 

మరిన్ని వార్తలు