అంబానీ, అదానీ కంపెనీల మధ్య వార్‌ జరగనుందా..!

7 Jul, 2021 18:31 IST|Sakshi

ముంబై: రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ 44వ ఎజీఎం సమావేశంలో 10 బిలియన్‌ డాలర్లను పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులను పెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుంగా ఎజీఎం సమావేశంలో 2035 నాటికి కర్బణ ఉద్ఘారాలను జీరో స్థాయికి తీసుకు రావడం లక్ష్యంగా తమ ప్రణాళిక ఉందని ముఖేష్‌ అంబానీ వెల్లడించారు. కాగా ముఖేష్‌ అంబానీ గ్రీన్‌ఎనర్జీలోకి ఏంట్రీతో అదానీ సోలార్‌ కంపెనీలకు తలనొప్పిగా మారనుంది. ముఖేష్‌ రాకతో ప్రస్తుతం ఉన్న సోలార్‌ విద్యుత్‌ ఛార్జీలు పూర్తిగా తగ్గిపోతాయని వ్యాపార నిపుణులు భావిస్తోన్నారు.

భవిష్యత్తులో వీరి ఇరువురి మధ్య తీవ్ర పోటీ నెలకొంటుందని పేర్కొన్నారు. 2030 నాటికి గ్రీన్‌ ఎనర్జీ రంగంలో భారత్‌ను ముందుంచాలనే ఆశయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో ముఖేష్‌ అంబానీ, అదానీ ముందంజలో ఉన్నారు.రాబోయే తొమ్మిదేళ్లలో 100 గీగా వాట్ల ఫ్యాక్టరీలను నిర్మిస్తామని ముఖేష్‌ అంబానీ గత నెలలో  ప్రకటించిన విషయం తెలిసిందే. సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఎనర్జీ స్టోరేజ్ కోసం బ్యాటరీ ఫ్యాక్టరీ, ఫ్యూయల్ సెల్ ఫ్యాక్టరీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి ఒక యూనిట్ నిర్మాణానికి వచ్చే మూడేళ్ళలో తమ బృందం 10 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుందని ముఖేష్‌ తెలిపారు.

కంపెనీలు దూకుడు..టారిఫ్‌ల తగ్గుదల
భారత్‌లో ప్రతిష్టాత్మక గ్రీన్ ఎనర్జీ రంగానికి అనువైన స్థలంగా ఉంటుంది. గ్రీన్‌ఎనర్జీ రంగంలో పలు మల్టీ నేషనల్‌ కంపెనీలు ఎదగడానికి సహయపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. కాగా గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి  కంపెనీల మధ్య దూకుడు పెరుగుతోందని భావిస్తున్నారు. దీంతో కంపెనీలు  ఒకరినొకరు అధిగమించడానికి ప్రయత్నిస్తుండటంతో టారిఫ్‌లు మరింత తగ్గుతాయని వ్యాపార నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు.

తగ్గిపోయిన ఛార్జీలు
అదానీ కంపెనీలు గ్రీన్‌ ఎనర్జీలో భాగంగా ప్రతి సంవత్సరం 5 గీగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. అటు గ్రీన్‌ ఎనర్జీ రంగంలోకి రిలయన్స్‌ కంపెనీ రాకతో సౌర విద్యుత్‌ టారిఫ్‌లు గణనీయంగా తగ్గిపోయాయి. తాజాగా గుజరాత్‌లో నిర్వహించిన సౌర విద్యుత్‌ వేలంలో కిలోవాట్ గంటకు రూ. 2లకు పడిపోయింది. ప్రపంచంలోనే అతి తక్కువ సౌర విద్యుత్‌ టారిఫ్‌లు భారత్‌లో నమోదయ్యాయి.

భారత్‌లో 2030 నాటికి సౌర విద్యుత్‌ టారిఫ్‌లు కిలోవాట్ గంటకు రూ.1 తాకుతాయని  ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్లో ఎనర్జీ ఫైనాన్స్ స్టడీస్ డైరెక్టర్ టిమ్ బక్లీ అన్నారు. ప్రత్యర్థి వ్యాపారాలకు విఘాతం కలిగించడంలో రిలయన్స్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. చౌకైన స్మార్ట్‌ఫోన్‌లు,  డేటా ప్లాన్‌లతో,  జియో కేవలం ఐదు ఏండ్లలో భారత్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్స్‌ను సొంతం చేసుకుంది. 

మరిన్ని వార్తలు