Anand Mahindra Tweet: చైనాకు చురకలు అంటించిన ఆనంద్‌ మహీంద్రా

9 Mar, 2022 13:01 IST|Sakshi

టాలీవుడ్‌లోనే కాదు రిమేకైన అన్ని భాషల్లో దుమ్ము రేపింది పోకిరి సినిమా.  ఆ సినమాలో ఫేమస్‌ డైలాగుల్లో ఒకటి.. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయా.. బుల్లెట్‌ దిగిందా లేదా అంటూ మహేశ్‌ మాటలతోనే తూటాలు పేల్చాడు. సరిగ్గా అలాంటి డైలాగ్‌నే చైనా రక్షణ బడ్జెట్‌ కేటాయింపులను ఎద్దేవా చేస్తూ ఆనంద్‌ మహీంద్రా అన్నారు.

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రక్షణ రంగానికి దాదాపు 230 బిలియన్‌ డాలర్లు కేటాయించినట్టు చైనా ప్రకటించింది. ఇంచుమించు అమెరికా స్థాయిలో రక్షణ రంగానికి బడ్జెట్‌ కేటాయించింది చైనా. మన దేశ రక్షణ బడ్జెట్‌తో పోల్చితే ఇది మూడు రెట్లు ఎక్కువ. ఈ బడ్జెట్‌ కేటాయింపులకు సంబంధిన వార్తలు జాతీయ మీడియాలో వచ్చాయి. వీటిని ప్రస్తావిస్తూ చైనాకు చురకలు అంటించారు ఆనంద్‌ మహీంద్రా.

రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఉదహారిస్తూ సైజ్‌ అనేది అసలు విషయమే కాదు. ఫ్యూచర్‌లో యుద్ధ రీతులు మొత్తం మారిపోనున్నాయి. భారీగా ఉండే యుద్ధ ట్యాంకుల కాన్వాయ్‌ని అతి చిన్నగా ఉండే సాయుధ డ్రోన్లు తుత్తునియలు చేశాయి. ఎంత ఖర్చు పెట్టామన్నది ముఖ్యం కాదు ఎంత స్మార్ట్‌గా ఖర్చు పెట్టామన్నదే లెక్క అంటూ బడాయిలకు పోయిన చైనాకు చురకలు అంటించారు ఆనంద్‌ మహీంద్రా.

ఫేమస్‌ ఇండస్ట్రియలిస్ట్‌ చైనా పట్ల వ్యంగగా చేసిన ట్వీట్‌ పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. భవిష్యత్తులో వార్‌ఫేర్‌ పూర్తిగా మారిపోనుందన్నారు. శాటిలైట్‌, కమ్యూనికేషన్‌ ఆధారిత యుద్ధం ప్రధానంగా జరుగుతుందన్నారు. దానికి తగ్గట్టుగా మారడం బెటర్‌ తప్పితే భారీ ఆయుధాలు సమకూర్చుకోవడం వృధా అంటున్నారు నెటిజన్లు.

చదవండి: Anand Mahindra: రష్యా - ఉక్రెయిన్‌ దేశాలే కాదు..ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంది

మరిన్ని వార్తలు