ఎగవేతదారుల నుంచి చేసిన రికవరీ ఎంతో చెప్పిన ఆర్థిక మంత్రి

21 Dec, 2021 06:07 IST|Sakshi

లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌  

న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా బ్యాంకింగ్‌ను కోట్లాది రూపాయలు మోసం చేసి, దేశం నుంచి పారిపోయిన వాళ్ల నుంచి వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంతత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. 

విజయ్‌మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీసహా ఈ తరహా వ్యక్తుల ఆస్తుల అమ్మకం ద్వారా బ్యాంకులు రూ.13,100 కోట్ల రికవరీ చేసినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు తెలిపారు. జులై 2021 నాటి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టోరేట్‌ అందించిన సమాచారం మేరకు ఈ వివరాల్ని వెల్లడించారు ఆర్థిక మంత్రి. 

కాగా, గడచిన ఏడు సంవత్సరాల్లో కార్పొరేట్‌ సామాజిక బాధ్యతల (సీఎస్‌ఆర్‌) కింద కంపెనీలు రూ.1.09 లక్షల కోట్లు వెచ్చించినట్లు  కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

బొగ్గు గణనీయమైన నిల్వలతో సరసమైన ఇంధన వనరుగా ఉన్నందున భవిష్యత్‌లో బొగ్గు ప్రధాన ఇంధన వనరుగా నిలవనుందని  బొగ్గు వ్యవహారాల శాఖ ప్రహ్లాద్‌ జోషి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.   

మరిన్ని వార్తలు