Elon Musk: యాపిల్‌ పాలిషింగ్‌ క్లాత్‌, ఎలన్‌ తిట్టినంత పనిచేస్తున్నారు?!

24 Oct, 2021 18:48 IST|Sakshi

కొద్ది కాలం క్రితం యాపిల్‌ సీఈఓ  టిమ్‌ కుక్‌.. టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ను బూతులు తిట్టారంటా?' అనే కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాల్ని టీమ్‌ కుక్‌, ఎలన్‌ మస్క్‌లు ఆ కథనాల్ని కొట్టి పారేశారు. కానీ ఎలన్‌ మస్క్‌ మాత్రం టిమ్‌ కుక్‌పై రివెంజ్‌ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అందుకు ఊతం ఇచ్చేలా ఆ ఇద్దరి గురించి మరో చర్చ మొదలైంది. టిమ్‌ కుక్‌ నిజంగా ఎలన్‌ను తిట్టారో..? లేదో? కానీ ఎలన్‌ మాత్రం టిమ్‌ కుక్‌ ను టార్గెట్‌ చేస్తూ అన్నంత పని చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటారా?  

యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌, టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ల మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమంటుంది.ఆ విషయాన్ని మీడియా ఆధారాలతో సహా బయటపెట్టినా..అదేం లేదు. నాన్సెన్స్‌ అంటూ కొట్టి పారేస్తుంటారు. తాజాగా యాపిల్‌ గత సోమవారం(అక్టోబర్‌ 18) జరిగిన ఓ లాంఛ్‌ ఈవెంట్‌లో మాక్ బుక్ ప్రో, ఎమ్1 ప్రో, మ్యాక్స్ చిప్స్, థర్డ్‌ జనరేషన్‌ ఎయిర్ పాడ్స్‌ను రిలీజ్‌ చేసింది. వీటితో పాటు పాలిషింగ్‌ క్లాత్‌ గురించి ప్రస‍్తావించింది. యాపిల్‌ గాడ్జెట్స్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులు వాటిని శుభ్రం చేసేందుకు పాలిషింగ్ వస్త్రాన్ని వినియోగించాలని సూచించింది. అంతా బాగుంది కానీ పాలిషింగ్‌ క్లాత్‌ ధర రూ.1900 ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

యాపిల్‌ పాలిషింగ్‌ క్లాత్‌పై ట్రోలింగ్‌ కొనసాగుతుండగానే.. యాపిల్‌ సంస్థ ఇస్తాంబుల్‌లో యాపిల్ కొత్త స్టోర్‌ను ప్రారంభించింది. ప్రారంభానికి ముందు స్టోర్‌ గురించి టిమ్‌ కుక్‌ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌కు ఎలన్‌ రియాక్ట్‌ అయ్యారు. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఎలన్‌.. టిమ్‌ కుక్‌ను ఉద్దేశిస్తూ 'వచ్చి యాపిల్ పాలిషింగ్‌ క్లాత్‌ ను చూడండి టిఎం' అంటూ ట్వీట్‌కు రిప్లయి ఇచ్చారు. ఆ ట్వీట్‌కు నెటిజన్ల మాత్రం ‘పవర్‌ ప్లే: టెస్లా, ఎలన్‌ మస్క్‌, అండ్‌ ది బెట్‌ ఆఫ్‌ ది సెంచూరీ’ బుక్‌ గురించి చర్చించుకుంటున్నారు.
.  
ఆ బుక్‌లో ఏముంది
‘ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ రైటర్‌ టిమ్‌ హగ్గిన్స్‌ రాసిన ‘పవర్‌ ప్లే: టెస్లా, ఎలన్‌ మస్క్‌, అండ్‌ ది బెట్‌ ఆఫ్‌ ది సెంచూరీ’ అనే బుక్‌ విషయంలో అదే జరిగింది. అప్పుడెప్పుడో ఎలన్‌ మస్క్‌ టెస్లా విలీన ప్రతిపాదనను యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ముందుంచారట. అంతేకాదు డీల్‌ ఒకే అయితే తననే యాపిల్‌  సీఈఓగా ప్రకటించాలని మస్క్‌ కోరాడట. అంతే మస్క్‌ ప్రతిపాదనతో ఒంటికాలిపై లేసిన టిమ్‌ కుక్‌.. ఎలన్‌ను బూతులు తిట్టినట్లు టిమ్‌ హగ్గిన్స్‌ తన బుక్‌లో రాసుకొచ్చారు. కానీ అలాంటి ఒప్పొందాలు జరగలేదని.. ఒకరంటే ఒకర్ని ఇన‍్స్పిరేషన్‌ అంటూ డైలాగులు చెబుతుంటారు. 

చదవండి: యాపిల్‌ సీఈవోగా మస్క్‌!!.. బూతులు తిట్టేసిన టిమ్‌ కుక్‌, నాన్‌సెన్స్‌..

మరిన్ని వార్తలు