దలాల్ స్ట్రీట్ దంగల్‌: అదానీ, అంబానీ టాప్‌ ర్యాంకులు పాయే!

27 Sep, 2022 13:23 IST|Sakshi

సాక్షి,ముంబై: స్టాక్‌ మార్కెట్లో సోమవారం నాటి అమ్మకాలసెగ భారత కుబేరులను భారీ షాక్‌ ఇచ్చింది.ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో గౌతమ్ అదానీ మరోసారి మూడో స్థానానికి పడిపోయారు. అంతేకాదు రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ  కూడా టాప్-10 నుండి నిష్క్రమించారు

గౌతమ్ అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానానికి పడిపోయారు. దలాల్ స్ట్రీట్ లో సోమవారం నాటి భారీ నష్టాలతో బిలియనీర్ అదానీ ఇప్పుడు టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్  కంటే వెనుక బడి ఉన్నారు. 

గౌతమ్ అదానీ కంపెనీల షేర్ల క్షీణత కారణంగా అదానీ నికర విలువ 6.91 బిలియన్ డాలర్లు తగ్గి 135 బిలియన్ డాలర్లకు చేరుకుంది.ఆర్‌ఐఎల్ చీఫ్ నికర విలువ 82.4 బిలియన్ డాలర్లకు తగ్గడంతో 11వ స్థానానికి పడిపోయారు. ఈ నెల ప్రారంభంలో, బెజోస్‌ను అధిగమించి ప్రపంచంలోని రెండవ అత్యంత ధనవంతుడు, తొలి భారతీయుడు, తొలి  ఆసియన్‌గా నిలిచారుఅదానీ. 

IIFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022  ప్రకారం  గౌతమ్‌ అదానీ దేశంలో టాప్‌  ట్రిలియనీర్‌గా నిలిచారు.   ప్రకారం లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్‌తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కంపెనీలను నిర్మించిన ఏకైక భారతీయుడు గౌతమ్ అదానీ. పదేళ్లపాటు అత్యంత సంపన్న భారతీయ ట్యాగ్‌ను పట్టుకున్న అంబానీ ఈ ఏడాది రూ.7.94 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానానికి పడిపోయారు. 

మరిన్ని వార్తలు