రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌..! 50 లక్షల కార్లు మాయం..! అక్కడ భారీ సంఖ్యలో..

21 Mar, 2022 18:23 IST|Sakshi

కరోనా రాకతో ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్‌ సెక్టార్‌ పూర్తిగా దెబ్బతింది. ఎన్నడూ లేనంతగా ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఇక గ్లోబల్‌ చిప్‌ కొరత అన్ని రంగాలపై ప్రభావం చూపింది. రెండేళ్ల తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో... తాజాగా రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఆటోమొబైల్‌ సెక్టార్‌ పాలింట శాపంగా మారనుంది. ఈ యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 లక్షలకు పైగా వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపనుంది. 

రెండేళ్లలో..తగ్గిపోనున్న ఉత్పత్తి..!
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్చను ప్రారంభించినప్పటీ నుంచి అనేక దేశాలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే క్రూడాయిల్‌, వంట నూనె ధరలు అమాంతం ఎగిశాయి. ఈ యుద్ధం ఇప్పుడు ఆటోమొబైల్‌ రంగంపై భారీ ప్రభావాన్ని చూపనుంది. రష్యా -ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా రాబోయే రెండేళ్లలో 50 లక్షల కంటే తక్కువ కార్ల ఉత్పత్తి జరిగే అవకాశం ఉందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ మొబిలిటీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 2022 గాను కార్ల ఉత్పత్తి 81.6 మిలియన్ యూనిట్లకు, 2023లో 88.5 మిలియన్ యూనిట్లకు తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

యూరప్‌లో ఎక్కువ ప్రభావం..!
కార్ల ఉత్పత్తి విషయంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే యూరప్‌పై  భారీ ప్రభావం పడనుంది. ఈ ఏడాదిగాను యూరప్‌లో సుమారు 1.7 మిలియన్ల కార్ల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని  S&P గ్లోబల్ మొబిలిటీ అంచనా వేసింది. ఇందులో కేవలం 10 లక్షలకు పైగా రష్యా, ఉక్రెయిన్‌ దేశాల్లో జరిపే అమ్మకాలు. ఇక సెమీకండక్టర్ సరఫరా సమస్యలు,  ఉక్రెయిన్ మూలాధారమైన వైరింగ్ హార్నెస్‌ల కారణంగా కార్ల ఉత్పత్తి మరింత జఠిలంగా మారనుంది. ఉత్తర అమెరికాలో తేలికపాటి వాహనాల ఉత్పత్తి 2022లో 480,000 యూనిట్లు, 2023లో 549,000 యూనిట్లు తగ్గుతుందని అంచనా వేయబడింది. 

ఎలక్ట్రిక్‌ కార్లకు అడ్డంకిగా..!
రష్యా-ఉక్రెయిన్‌ యుద్దంతో అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్‌ ఆయిల్‌తో సహా, పలు ఖనిజాలు ధరలు అమాంతం ఆకాశాన్ని తాకాయి. కాగా ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీల్లో ఉపయోగించే నికెల్‌ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఆయా ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.  ఇక వాహన తయారీలో వాడే పల్లాడియంకు భారీ కొరత ఏర్పడనుంది. రష్యా సుమారు 40 శాతం మేర పల్లాడియం ఖనిజాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. 

చదవండి: అమెరికన్‌ కంపెనీకి మరో గట్టి కౌంటర్‌ ఇచ్చిన రష్యా..!  అదే జరిగితే భారీ నష్టమే..!

మరిన్ని వార్తలు