Hero MotoCorp: టూవీలర్‌ కొనుగోలుదారులకు మరోసారి భారీ షాక్‌..!

23 Dec, 2021 16:51 IST|Sakshi

వచ్చే ఏడాది నుంచి కార్ల ధరలను పెంచుతూ దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2022 నుంచి కార్లతో పాటుగా టూవీలర్‌ వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని కారణం భారత్‌లోని రెండో అతిపెద్ద టూవీలర్‌ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తీసుకున్న తాజా నిర్ణయమే.

భారీగా పెరగనున్న ధరలు..!
వచ్చే ఏడాది జనవరి 4 నుంచి హీరో మోటోకార్ప్‌కు చెందిన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై కంపెనీ గురువారం రోజున స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. క్రమంగా పెరుగుతున్న ముడిసరుకుల ధరల ప్రభావాన్ని పాక్షికంగా ఆఫ్‌సెట్ చేయడానికి ధరల పెంపు అనివార్యమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సుమారు రూ. 2000 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా హీరో మోటోకార్ప్‌ బైక్స్‌ మోడల్‌ను బట్టి కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. 

ఈ ఏడాది సెప్టెంబర్‌లో కూడా..!
పండుగ సీజన్‌ సందర్బంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో సుమారు రూ. 3000 వేలకు పైగా టూవీలర్‌ వాహనాల ధరలను హీరో మోటోకార్ప్‌ పెంచింది. కాగా ఇప్పటికే ప్రముఖ స్పోర్ట్స్‌ బైక్‌ సంస్థ కవాసికి ధరలను పెంచుతూ ప్రకటించింది. 

చదవండి: స్పోర్ట్స్‌ బైక్‌ లవర్స్‌కి షాక్‌ ! భారీగా బైకుల ధరలు పెంచిన ప్రముఖ కంపెనీ

మరిన్ని వార్తలు