ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ఓ సమస్యలపై ఎలా ఫిర్యాదు చేయాలి?

27 Jul, 2021 17:48 IST|Sakshi

మీకు ఈపీఎఫ్ఓలో ఖాతా ఉందా? పీఎఫ్ కు సంబంధించిన ఏదైనా సమస్య గురించి ఎవరికి తెలియజేయాలో అర్ధం కావడం లేదా? అయితే ఇక నుంచి మీరు తేలికగా ఫిర్యాదు చేయవచ్చు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) చందాదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సేకరించడానికి ఆన్‌లైన్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఒకవేళ మీరు గనుక ఈపీఎఫ్ విత్ డ్రా, ఖాతా బదిలీ, కెవైసీ మొదలైన వాటికి సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలని అనుకుంటే ఇప్పుడు మీరు గ్రీవియెన్స్ మేనేజ్ మెంట్ సీస్టమ్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అలాగే, ఈపీఎఫ్ ఖాతాదారుడు ఈపీఎఫ్ఓ ట్విట్టర్ హ్యాండిల్ @socialepfoకు ఫిర్యాదు చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో ఫిర్యాదు ఎలా ఫైల్ చేయాలి?

  • మొదట https://epfigms.gov.in/ పోర్టల్ సందర్శించండి
  • ఫిర్యాదు చేయడం కొరకు 'Register Grievance' మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు పీఎఫ్ సభ్యుడు, ఈపీఎస్ పెన్షనర్, యజమాని, ఇతర అనే ఆప్షన్ లలో ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకోండి.
  • పీఎఫ్ ఖాతా సంబంధిత ఫిర్యాదు కోసం పీఎఫ్ మెంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి. 
  • ఆ తర్వాత యుఏఎన్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి 'Get Details' మీద క్లిక్ చేయండి.
  • యుఏఎన్ తో లింక్ చేయబడ్డ మీ వ్యక్తిగత వివరాలు కంప్యూటర్ స్క్రీన్ పై కనిపిస్తాయి.
  • ఇప్పుడు 'గెట్ ఓటిపి' మీద క్లిక్ చేయండి. (ఈపిఎఫ్ఓ డేటాబేస్ లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు/ ఈమెయిల్ ఐడీకి ఒక్కసారి ఓటీపీ వస్తుంది) 
  • ఓటీపీ, వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన తర్వాత ఫిర్యాదు చేయాల్సిన పీపీ నెంబరుపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు స్క్రీన్ పై పాప్-అప్ కనిపిస్తుంది. దీనిలో, మీ ఫిర్యాదుకు సంబంధించిన బటన్ ఎంచుకోండి.
  • గ్రీవియెన్స్ కేటగిరీని ఎంచుకొని మీ ఫిర్యాదు వివరాలను ఇవ్వండి. ఒకవేళ మీ వద్ద ఏవైనా రుజువులు ఉన్నట్లయితే, వాటిని అప్ లోడ్ చేయవచ్చు.
  • ఫిర్యాదు రిజిస్టర్ చేసిన తరువాత, 'Add' మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
  • దీని తర్వాత మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్/మొబైల్ నెంబరుకు ఫిర్యాదు రిజిస్టర్ నెంబర్ వస్తుంది.

ఆన్‌లైన్‌లో ఫిర్యాదు స్టేటస్ ఎలా తనిఖీ చేయాలి?

  • ఈపీఎఫ్ఓలో ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత ఆ పోర్టల్ లోనే ఉన్న 'View Status" ఆప్షన్ ఎంచుకోండి.
  • ఇప్పుడు ఫిర్యాదు రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు/ఈమెయిల్ ఐడీ, సెక్యూరిటీ కోడ్ నమోదు చేసి సబ్మిట్ మీద నొక్కండి.
  • ఇప్పుడు మీ ఫిర్యాదు స్టేటస్ కంప్యూటర్ స్క్రీన్ పై చూపిస్తుంది. మీ ఫిర్యాదుపై ఈపీఎఫ్ఓ ఏ ప్రాంతీయ కార్యాలయం, అధికారి పనిచేస్తున్నారు చూపిస్తుంది.
మరిన్ని వార్తలు